మెంతులతో ౩౦ రోజుల్లో మీ జుట్టు అత్యంత పెరిగిందో చుడండి…

జుట్టు రాలిపోవడం అనే సమస్యను నేటితరంలో దాదాపు చాలామంది ఎదుర్కొంటున్నారు, కారణాలు ఏమైనా వెంట్రుకలు రాలిపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. దీంతో చుండ్రు నల్ల జుట్టు తెల్లబడటం వంటి ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి దీంతో శిరోజాలను రాలిపోకుండా కాపాడుకోవడం కష్టతరం అయిపోయింది, అయితే ఈ సమస్యలకు మెంతులు మనకు చాలా చక్కని పరిష్కారాన్ని ఇస్తున్నాయి. మెంతులు లేని వంట గదులు ఉండవు ,భారతీయుల ఆహారంలో మెంతులు చాలా వంటల్లో మెంతుల్ని వాడుతారు, మెంతులు ఇండియన్ పాపులర్ మసాలా దినుసులు, మేతి ,మెంతి అనే పిలిచే ఈ మసాలా దినుసులు బ్యూటీ కి చాలా బాగా సహాయపడుతుంది.

శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ముడతలు పడుతుంది, నల్లని వలయాలు ఏర్పడుతూ ఉంటాయి వీటిని మెంతులు అడ్డుకుంటాయి, స్కిన్ టోన్ను తేలిక పరిచే గుణం మెంతులకు ఉంది, మొటిమలు కూడా దరిచేరవు. శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవల్స్ని సమతుల్య పరుస్తుంది మెంతులు, జుట్టు ఆరోగ్యానికి మంచి ఔషధం, మెంతులతో తయారు చేసిన పేస్టును వాడడం వలన పైన చెప్పిన సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు. మెంతుల పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం! కొన్ని మందులను తీసుకొని వేడి కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టాలి, మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి, దీని చుట్టు కుదుళ్ళకు అంటేలా పట్టించాలి.

ఇలా 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి, దీంతో జుట్టు సంబంధిత సమస్యలు అన్నీ పోతాయి, శిరోజాలు నల్లగా, ఒత్తుగా పెరగడానికి కాకుండా, కాంతివంతంగా ఉంటాయి. కొబ్బరి నూనెకు బదులుగా వేరుశనగ నూనెను వాడినా ఫలితం ఉంటుంది, దీంతో చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది, అలాగే మెంతులు మందార పూలు కలిపి మెత్తని పొడిచేసి, ఆ పొడిని జుట్టుకు పట్టించాలి ,అరగంట అయ్యాక తలస్నానం చేయాలి, దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి.