హనుమంతుడికి దండం పెట్టి ఇలా చెప్పండి

స్వామి హనుమని ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలో, ప్రభుత్వాన్ని ఎలా చక్క పెట్టాలో, ప్రజలతో ఎలా మాట్లాడాలో, ఉద్యోగుల తో ఎలా మాట్లాడాలో, మంత్రులతో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడి అవతల వారి యొక్క హృదయంలో చోటు సంపాదించుకోవాలో,తమ మాటలతోటి పదిమందికి మార్గదర్శనం ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకే ఆయనను ఎవరైతే స్మరిస్తారు వారందరికీ కూడా అటువంటి వాక్పటుత్వం లభిస్తుంది. ఆ వాక్కు వలన ఇతరులకు ప్రయోజనం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అది హనుమ ఉపాసన వల్లనే జరుగుతుంది. ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తే ఎంత గొప్ప వాక్యజ్ఞనుడు అనే విషయం తెలుస్తుంది.అలాగని అస్తమానం మాట్లాడరు ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉండడం ఆయన యొక్క గొప్పతనం. రామాయణంలో మిగిలిన కాండలకు ఏ పేర్లు ఉన్న, సుందరకాండ కు మాత్రం మహర్షి సుందరకాండ అని పిలిచేవారు.సుందరకాండ లో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతం. ఒకటికి 10 మార్లు రామకథ చెప్పబడుతుంది, రామ కథయే మృత సంజీవని, కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప అదే పనిగా సాగదీసి మాట్లాడడు. దీనికి ఒక ఉదాహరణ చూస్తే ఆయన సముద్ర లంకణం చేసి వెళ్ళిపోతున్నాడు.

సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములు కలిగినటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి, నువ్వు పైకి ,కిందకి, పక్కలకి ,పెరగగలవు ఇక్ష్వాక వంశంలో పుట్టినటువంటి రామచంద్ర మూర్తి కి సహాయం చేయడానికి హనుమవెళ్తున్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారి వల్ల వచ్చాం, కాబట్టి తిరిగి ప్రత్యుపకారం చేయాలి. నువ్వు పైకి లే నీ శిఖరముల మీద పండ్లు ఉన్నాయి, తేనే పట్లు ఉన్నాయి, ఆ హనుమ కి స్వాగతం ఇయ్యి ఆతిథ్యం ఇవ్వు అన్నాడు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది, వెంటనే మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడ్డాడు.స్వామి హనుమ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, ఈ సనాతన ధర్మము నందు ఒక విషయం ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. నీ తండ్రి అయినటువంటి వాయువు ఒకప్పుడు నాకు ఉపకారం చేశాడు, కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి.

అవి గాలిలో ఎగిరి వెళుతుంటే ఎక్కడ దిగుతాయో అని తాము మరణిస్తామని ఋషి సంఘములు భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి పర్వతం యొక్క రెక్కలు తొలగింపసేసాడు. ఆ సమయంలో నేను మైనాక పర్వతాన్ని అయినా ,బంగారు శిఖరములు ఉన్న ఎగరడానికి భయపడిపోయి భయంతో కదలలేక ఉండిపోతే మీ తండ్రి స్నేహితుడు కనక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో ఉంచాడు.అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటటువంటి మార్గానికి మూత లాగా అడ్డంగా పడ్డాను. పోనీలే వీరు భయంతో కదలడు అడుగున నుండి రాక్షసులు రారు అని ఇంద్రుడు నన్ను ఏమి అపకారం చేయకుండా వదిలేశాడు. రెక్కలు ఉన్నా పైకి రాలేక భయంతో ఉండి పోయాను.మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేసాడు,తండ్రి కొడుకు అభేదం. ఇవాళ ఆయన కుమారుడైన నువ్వు రామ కార్యం మీద వెళ్తున్నావు, ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చేయొద్దు! సామాన్యమైన అతిధి వస్తేనే పొంగిపోతాము, అందులో నీ వంటి అతిథి లభిస్తాడు మాకు కాబట్టి ఒక్క సారి నా శిఖరముల మీద వాలు కూర్చో, కాస్త తేనే తాగు రెండు పండ్లను తీసుకోండి ఆ తర్వాత బయలుదేరండి అంటాడు.