కృతిశెట్టి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా …

అందాల భామ కృతి శెట్టి ఫిలిం ఇండస్ట్రీలోకి ఉప్పెన, సినిమాతో ఉప్పెనలాగా వచ్చి టాలీవుడ్ ని షేక్ చేసింది. తన అంద చందాలతో మూవీ లవర్స్ ని ముంచెత్తింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటు తెలియదు కానీ, వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో హ్యాట్రిక్ హిట్టు హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే మిగిలిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

దీంతో బేబీ అమ్మ కొంచెం అప్సెట్ అయిందని చెప్పాలి. కాగా ఈరోజు అమ్మడి పుట్టినరోజు. ఆమె 19వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీంతో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నేటిజెన్లు కృతి శెట్టి ఆస్తులు బ్యాక్గ్రౌండ్ గురించి సర్చ్ చేస్తున్నారు.

కృతి శెట్టి ఫ్యామిలీ ముందు నుంచి దనిక కుటుంబమే, కృతి శెట్టి 2003లో కృష్ణ శక్తి నీటి శెట్టి దంపతులకు మంగళూరులో జన్మించింది. అనంతరం వ్యాపారాల కోసం వీరి ఫ్యామిలీ ముంబాయికి మారింది. ప్రస్తుతం వేరే ఫ్యామిలీ ముంబాయి తో పాటు బెంగళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్, దీంతో తన కూతురిని నటిని చేయాలని నిర్ణయించుకుంది.

అందుకే మోడలింగ్లో చేర్పించి యాడ్స్ కూడా చేయించింది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో కృతి శెట్టి కి ఉప్పెన మూవీలో అవకాశం వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అవడంతో కృతి శెట్టి క్రీజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం ప్రతి శెట్టి ఒక చిత్రానికి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటుందట.