తమల పాకు చెట్టు ఇంట్లో ఉంటే..

తమలపాకు చెట్టును మామూలుగా అందరూ కూడా ఈ రోజుల్లో పిల్లలు పెంచుకుంటూ ఉన్నారు. తమలపాకు చెట్టును దైవసంభూతిగా అంటే ఇప్పుడు తులసి మొక్కకి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాము అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలా? లేదంటే తమలపాకు చెట్టును మిగిలిన మొక్కలు లాగానే చూసుకోవచ్చా?ఎప్పుడు పడితే అప్పుడు తమలపాకులను తెంచకూడదు అని వాటిని దేవుడికి మాత్రమే నైవేద్యంగా పెట్టాలని, వాటిని తీసుకుని మనం నోట్లో వేసుకోకూడదు అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి అడుగుతూ ఉంటారు. మనకు ప్రతి చోటా ప్రతి మొక్క కూడా దొరికే అవకాశం ఉంది, అయితే తులసి మొక్కని మనం దైవ సంభూతిగా భావిస్తాం ఎందుకంటే తులసి మొక్క రాత్రిపూట కూడా కార్బన్డయాక్సైడ్ ను విడుదల చేయదు .

అందుకని తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఉంచుకోండి అని చెప్పడం జరిగింది. దీనిని ఎలా చేశారు అంటే తులసిని అమ్మవారి లాగా అలాగే తులసి మొక్క ఎండిపోతే ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది అంటూ భావిస్తారు. మన ఇంట్లో ఏదైనా పండగలు కానీ వ్రతాలు కానీ జరిగినప్పుడు తాంబూలం ఇవ్వాలి, ఈ తాంబూలం అనేది ఒక సేవగా భావిస్తారు, ఇలా తాంబూలం దేవుడికి పెట్టి దానిని ఇంట్లో ఉన్నవారికి ఇచ్చేవారు, అలాగే ఒకప్పుడు నిత్యం తాంబూల సేవనం చేసేవారు ఇప్పుడు మనం ఆచారాన్ని మర్చిపోయాం, కొంతమందిలో ముత్తైదువలో ప్రతిరోజు తాంబూలం వేసుకోవాలి అని నియమం కూడా ఉంటుంది. ఎందుకంటే తమలపాకు వేస్తున్నాం రాసి వేసుకుంటే కాల్షియం పెరుగుతుంది.

మనం సున్నాన్ని అలాగే తినలేము కాబట్టి తాంబూలంతో పాటు తీసుకోగలుగుతాం కాబట్టి అలాగే ఆడవారికి కాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి అప్పుడు తాంబూలాలను ఎక్కువగా తీసుకునేవారు. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది రసం మింగేసి ఆకు ఉమ్మేయాలి. బాలింతలు డెలివరీ అయిన తర్వాత 11వ రోజు నుండి ప్రతి రోజు కూడా తాంబూలం వేసుకోవాలి, ఒకవేళ తమలపాకు దేవుడు ఆకు అయితే బాలింతలు తినకూడదు కదా, కాబట్టి తమలపాకును ఇళ్లలో పెంచుకోకూడదు వాటిని కోయకూడదు తినకూడదు అనే నియమం అయితే ఏమీ ఉండదు. తమలపాకు అన్ని ప్రదేశాలలో పెరగదు దానికి అనువైన ప్రదేశం ఉండాలి ఎక్కువ వేడిగా ఉన్న ప్రదేశంలో తమలపాకు ఆకులు ఎక్కువగా రావు.

కొందరి ఇంట్లో ఎవరైనా ముత్తైదువులు వస్తే తాంబూలం ఇవ్వడం అనేది వారి ఆచారం అలాంటప్పుడు తమలపాకులు కోయకూడదు అనే మాట అనేది సరికాదు. అలాగే ఆంజనేయ స్వామికి శనివారం, మంగళవారం ఆకు పూజ కూడా చేయిస్తారు, ఇలా భగవంతునికి అర్చన చేసిన ఆకులు తాంబూలంగా తీసుకోవడం వల్ల కూడా మనకి కొంత ప్రయోజనం లభిస్తుంది. అందువల్ల తమలపాకు అనేది మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలను చేకూరుస్తుంది మనం తిన్న ఆహారం అరగడానికి తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే గొంతులో కఫాన్ని తొలగిస్తుంది. అందువల్ల తమలపాకును కేవలం దైవ సంభోదంగా మాత్రమే కాకుండా మన ఆరోగ్యం కోసం కూడా వాటిని ఇంటిలో పెంచుకొని వాడుకోవచ్చు.