తిన్న తరువాత వెంటనే ఇంత నోటిలో వేసుకోండి మీకు అంతులేని లాభాలు…

మన ఆచారాల్లో విందు భోజనాల సమయంలో, పండగలు, శుభ శుభకార్యాల సమయంలో భోజన అనంతరం తాంబూలం వేసుకోవడం ఒక అలవాటు, అలాగే అది అకేషన్ కి మాత్రమే వేస్తారు.కానీ రెగ్యులర్ గా భోజన అనంతరం, మనం రెస్టారెంట్ కి, హోటల్ కి, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు భోజనానంతరం సోంపు పెడుతూ ఉంటారు. చాలామంది డబ్బులు ఉన్నవారు, డైనింగ్ టేబుల్ పై సోంపు ఉంటుంది.భోజనం అనంతరం నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు, మరి ఈ సోంపు భోజనానంతరం ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా?సోంపు మీద స్పెషల్ గా మన దేశంలోనే 2012వ సంవత్సరంలో “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్”వీళ్లు డైజేషన్ కి సోంపు ఎంతో ఉపయోగపడుతుంది అని నిరూపించారు, సోంపు అనేది 100 గ్రాములు తీసుకుంటే సహజంగా 40 గ్రాముల ఫైబర్ ఉంటుంది, దీంతో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి, మనం ఒక చిన్న స్పూను సోంపును నోట్లో వేసుకుంటే, ఇందులో రెండున్నర గ్రాముల ఫైబర్ వెళ్తుంది.

కొంతమంది భోజనం తర్వాత సుమారుగా రెండు మూడు స్పూన్ల సోంపును నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. ఒక 4 – 5 గ్రాముల ఫైబర్ అనేది దీని ద్వారా మీ బాడీ లోకి వెళుతుంది, ఈ సొంపులో స్పెషల్ గా ఎనీటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది, ఈ ఎనీటాల్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్ బాగా ఉండటం వల్ల, ఇది మెయిన్ గా పొట్ట లోనూ ప్రేగు లోనూ పేన్స్టాల్ టిక్ మూమెంట్ ను బాగా పెంచడానికి ఎనీటాల్ అనేది ఉపయోగపడుతుంది, దీనివల్ల డైజేషన్ చురుగ్గా జరుగుతుంది, ఈ డైజేషన్ సరిగ్గా జరగడం వల్ల పులీసే అవకాశం తగ్గుతుంది, అందుకని పులవకుండా ఆహార పదార్థాల్లో గ్యాస్ ఎక్కువ రిలీజ్ పుల్లటి త్రేన్పులు నోట్లో కి రాకుండా, ఎనీటాల్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్ అద్భుతంగా పనికొస్తుంది, అందుకే భోజనానంతరం సోంపు వేసుకోవడం వల్ల పుల్లటి త్రేన్పులు నోట్లోకి ,గ్యాస్ రావడం, డైజేషన్ సరిగ్గా అవ్వకుండా ఉండే సమస్యల నుండి ఉపశమనానికి చక్కగా పనికొస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.అలాగే ఈ సొంపులో ఉండే కెమికల్ కాంపౌండ్ మన పొట్టలో ఉండే స్మూత్ మజిల్స్ ని రిలాక్స్ చేసి, ఎక్కువ యాడ్స్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుందని కూడా సైంటిఫిక్ గా చెప్పబడింది.

అందుకని ఇది ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. ఈ సోంపు లో కొన్నిచోట్ల ధనియాల పప్పు కూడా కలిపి అమ్ముతారు, ఈ రెండింటి కాంబినేషన్స్ కూడా డైజెస్టివ్ ప్రాబ్లంస్ లేకుండా, భోజనం అనంతరం 1,2 స్పూన్ ల వరకు నోట్లో వేసుకుని నమలడం అనేది ఆరోగ్యానికి మంచిది. సోంపు లో మరొక బెనిఫిట్ ఉందని వారు నిరూపించారు, ఈస్టర్ గోల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ మెదడులో పార సింపథిటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్టివిటీ ని పెంచుతున్న గా అందుకని స్ట్రెస్ను తగ్గించడానికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలలో ఉండే యాక్టివిటీ ని పెంచడానికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుందట, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి భోజన అనంతరం సోంపును వేసుకొని నమలడం వల్ల అందులో ఉండే నూట మనం మింగుతూ ఉంటే మెల్లగా డైజెస్టివ్ జ్యూస్ నీ ఎంజైమ్స్ క్రియేషన్ పొట్టలో పెరగడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తాయి, మలబద్ధకం ఉన్నవారు కూడా సోంపును అల్పాహారం భోజనం తర్వాత తింటే చాలా మంచిది.