తిరుమల తిరుపతి ఆలయం ఎలా పుట్టింది…ఆలయ ప్రత్యేకతలేంటి…పూర్తి చరిత్ర

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం, మన తెలుగు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు 30000 నుంచి 40 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అది కొత్త సంవత్సరం రోజున జనవరి ఫస్ట్ అయితే ఏకంగా 75 వేల మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యధిక ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో సైతం స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి, ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు.

ఇక్కడ స్వామి వారు ఎలా అవతరించారు. ఈ ఆలయ ప్రత్యేకత చరిత్ర ఏమిటి అనే పూర్తి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలయడానికే ముందు అసలేం జరిగింది. పురాణాలలో ఏముంది అనేది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ శివుడు విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకి యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దానితో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషులలో ఒకడైన బృగు మహర్షిని త్రిమూర్తులు పరీక్షించేందుకు పంపుతారు. దేవతల రాజైన ఇంద్రుడు దగ్గరికి వెళ్తాడు, ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి.

బృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు, దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకారంగా సూచిస్తుందని శపించి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మృగ మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దగ్గరకు వస్తాడు, బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న నాలుగు తలలలో ఒకతలతో వేదాలతో పటించడం, మరొకతలతో ధ్యానం చేయడం, మరొకతలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో పాలతో తన భార్య సరస్వతి తో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి, బృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాతబృగు మహర్షి శివుడు దగ్గరికి వెళతాడు ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతీతో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు.

దాంతో భృగు మహర్షికి కోపానికి దురై శివుడిని నీవు ఎప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పోజింపబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణు దగ్గరికి వెళతాడు, ఆ సమయంలో విష్ణువు లక్ష్మీదేవి వడిలో నిద్రిస్తూ ఉంటాడు, బృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు, విష్ణువు పాదాలు అనేది మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండడం చేసి అదే చాలా అవమానంగా భావిస్తాడు, దాంతో కోపానికి లోనైనా బృగు మహర్షి విష్ణు అనే చాతి పై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణు పాదాలకు మొక్కడం ప్రారంభించాడు, అలాగే బృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు, దాంతో మహర్షి సంతోషించే విష్ణువుకి వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి