శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది…? కారణాలు ఇవేనా..? జాగ్రత్తలు తీసుకోకపోతే..?

Blood Clotting : శరీరంలో రక్తం గడ్డ కట్టడం అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. దీని కారణంగా అనేక రకాల ప్రాణాంతక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలు శరీరంలో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది..?దానికి గల కారణాలేంటి..?వాటిని ఎలా ఎదుర్కోవాలి..?వంటి విషయాలు గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.రక్తం గడ్డ కట్టడానికి దారి తీసే కారణాలలో అనేక రకాల అంశాలు ఉంటాయి. అయితే దీనికి ప్రారంభ దశలో చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే మాత్రం శరీరమంతా రక్తం గడ్డకట్టి గుండెపోటు , హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. ఇక ఇది ప్రాణంతకరం కూడా కావచ్చు. అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం చాలా సందర్భాలలో గుండెపోటు మరియు హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రక్తం గడ్డ కట్టడం వలన వచ్చాయని తెలిసింది.

ఈ సమస్య ఎవరిలో ఎక్కువ….

అయితే గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించే ప్రతి 1 మిలియన్ మహిళల్లో దాదాపు 1200 మందికి రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని తాజాగా మెట్రో హాస్పిటల్ లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ తెలియజేశారు. శరీరంలో రక్తం గడ్డకట్టక పోవడానికి గర్భ నిరోధకాలు కూడా ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ ఏం చెబుతున్నారంటే… కరోనా వైరస్ కారణంగా త్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ తో త్రంబోసిస్ సంభవిస్తుందట. ఇక ఈ వైరస్ అనేది గుండె ధమనులలో రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందట. దీంతో గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లుగా వారు తెలిపారు.

ధూమపానం చేసేవాళ్లు…

అదేవిధంగా ధూమపానం చేసే 1 మిలియన్ మందిలో 17,000 మందికి రక్తం గడ్డకట్టే సమస్య వస్తుందట. అదేవిధంగా ఈస్ట్రోజన్ కలిగిన మందులను తీసుకోవడం వలన కూడా ఈ ప్రమాదం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరంలో కొవ్వు పెరగడం మధుమేహం కీళ్ల నొప్పులు అధిక బీపీ వంటి సమస్యల వలన కూడా రక్తం గడ్డ కడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. గమనించగలరు.

Add Comment