కిలోల్లో కొవ్వు కరిగిపోవడం మీరే గమనిస్తారు…

స్థూల కాయం ఇది చాలా రెగ్యులర్ కామన్ ప్రాబ్లెమ్ అయిపోయింది, షుగర్ ,బీపీ ఎలాగో అలాగే స్థూలకాయం కూడా ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఈ స్థూలకాయానికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది దీనికి మేజర్ రీసన్స్ అందరికీ తెలిసినవే, దీనివల్ల ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ తెలుసు తమ లైఫ్ స్టైల్ వల్లే ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నామని. అయినా సరే వాళ్ళు రెమెడీ కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అయితే నాచురల్ గా బరువు తగ్గడానికి ఏవైనా రెమిడి ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుందాం.

మనం మన నోటిని కట్టెగలిగితే, చాలామంది మేము అంతగా ఏం తినడం లేదండి సాయంత్రం పూట ఏదో రెండు చపాతీలు తింటాం అంటారు, పొద్దున ఏదో లైట్గా తీసుకుంటాం, అయినా సరే బరువు తగ్గరు. ఈ స్థూలకాయమనేది సమయపాలన లేకపోవడం వల్ల, అలాగే మనం ఎంత తిన్నాము అనే దానిమీద కాకుండా మనం టైం కి తింటున్నామా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. జనరల్ గా చెప్పాలంటే బరువు పెరగడానికి లాబ్ ఎక్కడానికి అసలు కారణం సరిగ్గా తినకపోవడమే, చాలామంది తిండి మానేస్తూ ఉంటారు, ఇలా కాకుండా మీరు ఏదైతే తినాలి అనుకుంటున్నారో దాన్ని తినండి కానీ అది తినాల్సిన టైంలో మాత్రమే తినండి. ఇక్కడ బరువు పెరిగి లావు అవ్వడానికి కారణాలు ఏమిటంటే ఆహారపు అలవాటు ఒకటి .

అలాగే హార్మోనల్ఇ oబ్యాలెన్స్ మరొకటి. ఇక్కడ ఆహార నియమాన్ని మార్చుకోగలిగితే అంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్న దాన్ని ఎప్పుడు తీసుకుంటున్నాము అనే విషయాన్ని గమనించండి. ఉదాహరణకి మీరు ఎనిమిది గంటలకు 9 గంటలకు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ మీరు 10 గంటలకి 11 గంటలకు ఇస్తే అప్పటికి మన శరీరం సిస్టం అనేది రెడీగా ఉంటుంది మనం తిన్న ఆహారాన్ని మెల్ట్ చేయడానికి, అక్కడ అప్పటికి మనం ఆహారం తీసుకోకపోవడంతో ఎమైనో ఆసిడ్స్ రిలీజ్ అయ్యి పక్కన ఉండే పొరలను తినేసి ఎసిడిటీ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత తిన్నప్పుడు కడుపులో మంట ఎక్కువ అవుతుంది. దానికి పరిష్కారంగా ఈనో లాంటిది తీసుకోవడం జరుగుతుంది, మీరు ఈ సిస్టం మార్చకపోతే ఎన్ని డైట్స్ చేసిన ఎన్ని ప్రకృతి ఆశ్రమాలకు వెళ్లిన ఎలాంటి ఫలితం ఉండదు.

నైట్ ఆహారం తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు, తినడం వల్ల నష్టాలు వస్తాయి కానీ తినకపోవడం వల్ల అసలు ఎలాంటి నష్టాలు ఉండవు, ఒక రెండు రోజులు మూడు రోజులు మాత్రం కొద్దిగా ఆకలి వేసి బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు అలా తినడానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ప్రేగు ఆహారాన్ని అడుగుతూ ఉంటాయి. సూర్యపచారాలలో సూర్యాస్తమయం దాటిన తర్వాత భోజనం చేయడం అనేది అలా తప్పు ఇది మహా పాపంగా భావిస్తారు. అలాగే చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు, చల్లని పదార్థాలను కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ లాంటివి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న టెంపరేచర్ పడిపోతుంది మళ్లీ దానిని అప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

అలాగే భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీమ్ తినడం వల్ల చల్లటి పదార్థాలు అంటే విరుద్ధ స్వభావం కలిగిన పదార్థాలురెండు మూడు కలిపి ఒకేసారి వేయడం వల్ల ఈ ఒబిసిటీ హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ రావడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ వస్తే అద్భుతమైన రెమిడి ఏమిటంటే అది థైరాయిడ్ కావచ్చు ఒబిసిటీ కావచ్చు పిసిఒడి కావచ్చు వీటిలో ఏదైనా సరే దీనికోసం నిమ్మకాయ రసం పిండి తొక్కలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి దానికి ఒక ఇంచు అల్లం ముక్కను యాడ్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి, దానికి 100 నుండి 150 ఎంఎల్ వాటర్ పోసి ఉడకపెట్టి దానిలో మిరియాలపొడి కల్లుప్పు వేసుకుని రెగ్యులర్గా ఒక మూడు నెలల పాటు చేస్తే థైరాయిడ్ వెళ్ళిపోతుంది అలాగే పిసిఒడి వెళ్ళిపోతుంది ఇంబ్యాలెన్స్ వెళ్ళిపోతుంది మీరు చాలా ఆరోగ్యంగా,సంతోషంగా ఉండవచ్చు.