నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ సంచలన ట్వీట్

హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విజయ్ ఆంటోనీ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. నా బిడ్డతో పాటు తానూ చనిపోయానని చెప్పారు. ఇక నుంచి తాను చేసే ప్రతి మంచి పని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని చెప్పారు. ఇదే విషయంపై ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు. అందులో… తన కుమార్తె ప్రేమగల ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయి. ఇపుడు ఆమె ఏ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ఓ మంచి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లిపోయింది.

తన కుమార్తె ఇప్పటికీ తనతో మాట్లాడుతూనే ఉంది. తాను కూడా తన కుమార్తెతో పాటు చనిపోయానని తెలిపారు. ఇక నుంచి తాను ఏ మంచి పని చేసినా ఆమె కోసమే చేస్తాను. ఆమె పేరుమీదే చేస్తాను అని విజయ్ ఆంటోనీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది .ఈ ట్వీట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు .మంచి నిర్ణయం తీసుకున్నారు అని కొందరు ,మీకు ఆ దేవుడు ధైర్యాన్ని ,సహనాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ..