పాపం.. మాస్టర్ చివరి కోరిక ఇదే..!

శివ శంకర్ మాస్టర్ సినీ జగత్తులో ఆయన నటరాజుకు నిజ స్వరూపం అని చెప్పుకోవచ్చు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మాస్టర్ మొత్తం ఎనిమిది వందల చిత్రాలలో, కొన్ని వేల పాటలు డాన్స్ కంపోజ్ చేశారు. ఎంతో మంది స్టార్ హీరోలు, మాస్టర్ డాన్సులతో మంచి పేరు తెచ్చుకున్న వారే ఇలాంటి లెజెండరీ డాన్స్ మాస్టర్. కో విద్ కారణంగా కన్నుమూయడంతో ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్టర్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మాస్టర్ చివరి కోరిక ఏమిటి, అది తీరిందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

శివ శంకర్ మాస్టర్ తన జీవిత కాలంలో కొన్ని కోట్ల పైనే సంపాదించి ఉంటారు. కానీ చివరి రోజుల్లో ఆర్థికంగా చితికిపోయారు. హాస్పిటల్ ఖర్చులకి కూడా ఎక్కువ కావడంతో వైద్యానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ ఆయన చివరి కోరిక డబ్బు కి సంబంధించినది కాదు. ఆయన చివరి కోరిక కూడా డాన్స్ కి సంబంధించినది కావడం గమనార్హం. మాస్టర్ డాన్సర్ గా బిజీగా ఉన్న సమయంలో ఆయనకి అసలు సమయం ఉండేది కాదు, కానీ సినిమాల్లో రాను రాను క్లాసికల్ సాంగ్స్ అవసరం తగ్గిపోయింది. ఇదే సమయంలో మాస్టర్ కి వైసు అయిపోవచ్చింది. ఈ కారణంగా మాస్టర్ డాన్స్ కి దూరమైపోయారు. కానీ బుల్లి తెరపై డాన్స్ షోలో జడ్జిగా వచ్చి, పేరు సంపాదించుకున్నారు.కొన్ని సినిమాలలో నటుడిగా కూడా మెరిసిపోయాడు.

ఈ సందర్భంలోనే మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తన చివరి కోరికను బయటపెట్టారు. నాకు డబ్బు మీద, ఆస్తుల మీద వ్యామోహం లేవు. నాకు ఆ ఆ నటరాజు దయవల్ల కల అబ్బింది. ఆ కలని నా చావు తర్వాత కూడా బ్రతికి ఉంటే చాలు. సెట్ లో డాన్స్ చేస్తుండగానే నా ప్రాణం పోవాలి. డాన్స్ లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. అదే నా చివరి కోరిక అని మాస్టర్ తెలియజేశారు. శివ శంకర్ మాస్టర్ చివరి రోజుల్లో ఆరోగ్యం అంతగా సహకరించలేదు. ఆయన సినిమా సెట్లో చివరిసారిగా అడుగుపెట్టింది ఆచార్య కోసమే, ఏ రకంగా చూసుకుంటే మాస్టర్ తన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు అనుకోవచ్చు.