సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన 11 మందికి కరోనా పాజిటీవ్!

కరోనా వైరస్ వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ప్రతి ఒక్కరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోజులు గడిపేస్తూ బ్రతికారు.. బ్రతుకుతున్నారు. కరోనా ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది . తమ కళ్ల ముందే రక్త సంబంధికులు చనిపోతే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.ఇలాంటి బాధకరమైన సంఘటనలు మరువక ముందే… ఈ మధ్యలో పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా నిన్న మొన్నటి దాకా అందరిని భయపెట్టింది.

ఇలా కొత్త కొత్త వైరస్ లు వస్తున్నాయనే వార్తలతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వాటి నుంచి తమను రక్షించుకోవటం కోసం ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కరోనా, డెల్టా వేరియంట్ వంటి ప్రమాదకరమైన మరో వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇది మొదటగా సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గింది అనుకోని ప్రజలు సాధారణ స్థితికి వస్తున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ భయపెట్టేస్తుంది. తాజాగా సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా ఏకంగా 11 మందికి పాజిటివ్ అని తేలింది

. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.సౌతాఫ్రికాలోని బోట్స్ వానా నుంచి 16 మంది ప్రయాణికులు హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారని, వారిలో 11 మంది కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం పాజిటివ్ వచ్చిన వారికి ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ కు 185 మంది వచ్చినట్లు సమాచారం. ఇలా ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉన్నమని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ప్రజలు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ ను, శానిటైజర్ ను తప్పక వాడాలి.