బార్లీ గింజల గూర్చి తెలిసిన షాకింగ్ నిజాలు..

భారతీయ ప్రధాన ప్రాచీన ఆహార పంటల్లో బార్లీ ఒకటి. దీన్ని యవలు అని కూడా అంటారు. బార్లీ లో విటమిన్-ఎ, విటమిన్-బి2, బి3, బి6, బి9. విటమిన్-ఇ మొదలైన విటమిన్లు. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సోడియం, ఐరన్, జింక్, సెలీనియం, మాంగనీస్ మొదలైన ఖనిజాలు, మోనో అన్సాచురేటెడ్ యాసిడ్, పోలీ అన్సాచురేటెడ్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. బార్లీ గింజలు కొద్దిగా తీపి, వగరు రుచులు కలిగి చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మంచి సువాసనతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇలాంటి బార్లీ ని మన ఆరోగ్య సమస్యలకు ఎలా ఉపయోగించుకోవాలి చూడండి మరి.

1. బార్లీగింజలను కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి గంజిలా చేసుకుని వాడచ్చు, లేదా బార్లీ ని మరపట్టించి పిండితో రాగి జావ లాగా బార్లీ జావ కాచుకుని వాడచ్చు.

2. జ్వరాలు వచ్చినపుడు ఒళ్ళు కాలిపోతూ నీరసం ఆవరించి ఒళ్ళు హూనం చేస్తుంది. అప్పుడు అందరికి తెలియని అద్భుతమైన ఔషధం బార్లీ గింజలు అంటే ఆశ్చర్యమేస్తుంది. జ్వరాలు వచ్చినపుడు బార్లీ జావలో పంచదార లేక ఉప్పు లేక నిమ్మరసం లేక గ్లూకోజ్ వేసి తీసుకోవచ్చు. ఇది గొప్ప జ్వరాల నివారిణి గా పనిచేస్తుంది.

3. బార్లీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, గొంతునొప్పి, జ్వరము, బలహీనత, అతి దాహం వంటి సమస్యలు సులువుగా తగ్గుతాయి. మూత్రాశయములో మంట కూడా తగ్గిపోతుంది.

4. బార్లీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, గొంతునొప్పి, జ్వరము, బలహీనత, అతి దాహం వంటి సమస్యలు సులువుగా తగ్గుతాయి. మూత్రాశయములో మంట కూడా తగ్గిపోతుంది.

5. పిల్లల కోసం బార్లీ గంజి ని ఆవు పాలను సమానభాగాలుగా తీసుకుని తగినంత పంచదార వేసి కలిపి పెట్టడం వల్ల మంచి పౌష్టికరమైన ఆహారం ఇచ్చినట్టు అవుతుంది.

6. గ్లాసుడు బార్లీ జావలో ఒకటి లేదా రెండు చెంచాల తేనె కలిపి తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గిపోయి విరేచనం సాఫీగా జరుగుతుంది.

7. బార్లీ జావలో పటికబెల్లం కలిపి తీసుకోవడం వల్ల మగవారి వీర్య సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఈ బార్లీ జావను పటికబెల్లంతో కనీసం నెలరోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

8. బార్లీ గింజలను బాండీలో వేసి సన్న మంట మీద నల్లగా మాడిపోయేవరకు వేయించాలి. తరువాత వాటిని నువ్వులనూనెలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇలా చేసిన తరువాత వచ్చిన గందాన్ని కాలిన గాయాల మీద లేపనం చేస్తూ ఉంటే తొందరగా గాయాలు మానిపోయి కాలిన గుర్తుల నుండి చర్మాన్ని దూరం చేసి కొత్త చర్మం ఎదుగుదలకు సహకరిస్తుంది.

9. బార్లి పిండి, గోధుమ పిండి, మినప పిండి మూడు సమాన భాగాలు తీసుకుని వాటిని నీళ్లలో కలిపి ఉడకపెట్టి భరించ గలిగే వేడి ఉన్నపుడు గడ్డల మీద వేసి కట్టు కడుతూ ఉంటే గడ్డలు తొందరగా పక్వానికి వచ్చి పగిలిపోతాయ్. ఇలా పగిలిపోవడం వల్ల సమస్య తొందరగా తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ గడ్డలు రాకుండా ఉంటుంది. గడ్డలు కరగడానికి మందులు, ఆపరేషన్ ల ద్వారా తొలగించుకున్నా ఆ కణాలు ఉత్తత్తి అవుతూనే ఉంటాయి. అందుకే ఈ పద్దతి గడ్డల నిర్మూలనకు చాలా చక్కని పరిష్కారం.

10. అధికబరువు ఉన్నవారు బార్లీ పిండితో రొట్టె లేక బార్లీ గింజల జావ ఏదో ఒకటి తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

చివరగా……

గోధుమలు, రాగులు, జొన్నలు వాడినంత ఎక్కువగా బార్లీని వాడకపోవడానికి కారణం కేవలం బార్లీలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఎవరికి ఎక్కువగా తెలియకపోవడమే. అందుకే అందుబాటులో దొరికే బార్లీ ని వంటింట్లో ఉంచుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి బార్లీ ని కొనేయండి