పురుషులు రాత్రి పూట కాల్చిన వెల్లుల్లిని తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా…?

వెల్లుల్లి.. నిత్యం మ‌నం వంట‌ల్లో వాడే ప‌దార్థాల్లో ఇది ఒక‌టి. ఎంతో కాలంగా దీనిని మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుందని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా వెల్లుల్లి మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ప్ర‌తిరోజూ రాత్రి ప‌డుకునే ముందు కాల్చిన వెల్లుల్లి రెబ్బ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.

దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌లో ఓర్పు, స‌హ‌నం పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుల‌కు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో ** క‌ణాల సంఖ్య మ‌రియు వాటి నాణ్య‌త కూడా పెరుగుతుంది. పురుషుల్లో వ‌చ్చే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ ను నివారించ‌డంలో కూడా వెల్లుల్లి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. సంతానం కోసం ప్ర‌య‌త్నిస్తున్న దంప‌తులు రోజూ రాత్రి కాల్చిన వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వ‌చ్చే ***స్థంభ‌న స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణలో ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రాత్రి నిద్ర‌పోయే ముందు కాల్చిన వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచ‌డంలో కూడా వెల్లుల్లి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. మూత్ర‌పిండాలు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించే గుణం కూడా వెల్లుల్లికి ఉంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న వెల్లుల్లిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.