మొఖంపై అవాంఛిత రోమాలు పోవాలంటే.. మీరు చేయాల్సింది ఇంతే.. 

అమ్మాయిల ముఖం,కాళ్లు, చేతుల పై అనేక అవాంఛిత రోమాలు ఉండి ఇబ్బంది పెడుతున్నాయి.వాటిని తొలగించడానికి థ్రెడింగ్, షేవింగ్ మరియు లేజర్ చికిత్సను ఉపయోగిస్తారు.ఇవి చర్మ(skin) సమస్యలను కలిగిస్తాయి.మన ఇంటి చిట్కాలతో వాటిని చాల esay తొలగించగలిగితే,మంచి ఫలితాలను పొందుతారు. 2 టీస్పూన్ల శెనగపిండికి కొద్దిగా పసుపు, పాలు కలిపి ముద్దగా లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని అవాంఛిత రోమాలపై అప్లై చేయండి.

అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో అరకప్పు పంచదార వేసి స్టవ్ మీద ఉంచి మరిగించాలి.పేస్ట్ లాగా కాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో మసాజ్(massag) చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి, కొద్దిగా పసుపు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, 1 table spoon వేప పొడి మరియు కొంచెం పచ్చి పాలు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయండి. పావుగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పెరగవు.

2 టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండి, కొంచెం పసుపు వేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.15 నిమిషాల తర్వాత చల్లటి నీటి(water)తో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం అవాంఛిత రోమాలను శాశ్వతంగా దూరం చేస్తుంది