రక్తం పూర్తిగా శుభ్రం టిప్స్….

మనం ఈరోజు సుగంధపాల వేర్లు అని మీరు వినే ఉంటారు, దీనితో సాధారణంగా ఎండాకాలంలో షర్బత్ లు మాత్రమే తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ప్రజల అందరికీ ఇది సుపరిచితం, అయితే దీని ప్రయోజనాలు చాలా మందికి తెలియవు ఇది కేవలం చలువ చేస్తుంది అనుకుంటారు కానీ మంచి రక్తాన్ని శుభ్రపరిచ కలిగే గుణం దీనికి చాలా ఉంటుంది, మంచి సుగంధ వాసనను కలిగి ఉంటుంది, ముఖ్యంగా టీ తాగే టప్పుడు మంచి సువాసన కావాలి అని అనుకుంటారు, ఇది సాధారణంగా ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతూ ఉంటాయి దీంట్లో లో రకాలు ఉంటాయి నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, బర్రె సుగంధి ,దేశీయ సుగంధి ఇలా రకరకాలు ఉంటాయి, వీటిని తీసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు.

ఇప్పుడు సుగంధి పాలు తీసుకుని దీంట్లో మధ్య భాగంలో ఉండే కడ్డీ లాంటి భాగాన్ని తీసివేసి కేవలం పైన ఉండే బెరడును మాత్రమే తీసుకోవాలి, దీనిని మీరు పొడి పొడిగా దంచి టీ తయారు చేసుకునే టప్పుడు ఉపయోగించుకోవాలి. దీనికి మనకు ప్రధానంగా కావలసినవి సుగంధ పాల వేర్లు ఒక కప్పు కు 5 గ్రాములు సరిపోతుంది, తర్వాత మిరియాలు 4 , ఇలాచి 2, అల్లం ఒక చిన్న ముక్క తీసుకుని దీనిని ఒక కషాయం లాగా తయారు చేసుకోవాలి దీనికి మోడ్రన్ నేమ్, టీ అని పెట్టారు, ఇప్పుడు దీంతో టీ తయారు చేసుకునీ దాని తర్వాత కొంచెం పుదీనా కలుపుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ టీ తయారు చేసే పద్ధతిని చూద్దాం!

మొదటగా స్టౌ వెలిగించి ఒక గిన్నెలో నీటిని పోసి మరిగిన తర్వాత సుగంధ పాల పొడిని నీటిలో వేసుకోవాలి దీని బాగా మరగనివ్వాలి, ఇది ఇలా మరుగుతున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది తర్వాత ఇలాచి, మిరియాలను దంచి వేసుకోవాలి అలాగే దీంతో పాటు చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి తర్వాత దీనిని బాగా మరగనివ్వాలి, ఇలా మరిగిన తర్వాత ఈ నీటిని వడపోసుకొని దీనిలో తేనె కలుపుకొని, కొద్దిగా పుదీనా ఆకులను వేసుకోండి, పుదీనా వేసుకోవడం వలన ఇంకా మంచి సువాసన వస్తుంది. ఈ ,టి , మనకు యాంటీబ్యాక్టీరియల్ గా యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది కాబట్టి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాకూడా అలాంటివి కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని రోజులో రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. దీని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు.