రెండు నెలల్లో మీ జుట్టు పెరుగుదల చూసి మీరే ఆశ్చర్య పోతారు.

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య జుట్టుకి సరియైన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలుతుంది.ఈరోజులలో ఎవరైనా జుట్టుకు కుంకుడు కాయలు పెడుతున్నారా? ప్రతి ఒక్కరూ షాంపూ తోనే తలస్నానం చేస్తున్నారు.

జుట్టుకి సరి అయిన జిగురు అందకపోవడం వల్ల జుట్టు పొడి పారిపోయి చిట్లుతుంది. జుట్టు పెరగడం లేదు. జుట్టు బాగా పెరగాలంటే మన ఇంట్లో దొరికే మందార పువ్వులు ,మందార ఆకులు ,గోరింటాకు మూడు సమపాలల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జుట్టుకు ప్యాక్ లాగా వేసుకోవాలి .

అలా వేసుకోవడం వల్ల జుట్టుకి సరియైన పోషకాలు జిగురు అంది జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టుకు డ్రై హెన్నా ప్యాక్ వేసుకోవడం వల్ల ఇంకా డ్రై గా అయిపోతుంది .మందార ఆకులతో జుట్టుకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా అవుతుంది. చిట్ల కుండా ఉంటుంది.

అలాగే షాంపూ తో కాకుండా కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయాలి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. పది రోజులకు ఒకసారి జుట్టుకు మందార ఆకులు, మందార పువ్వులు, గోరింటాకు పేస్టుతో ప్యాక్ వేసుకోవడం వల్ల కలిగే లాభాలను మీరే గమనిస్తారు.