హైదరాబాద్‌లో 365 రోజులు వివిధ రకాల మిల్లెట్స్ ఫుడ్ 365ప్లేస్ లలో ఉచితంగా ..

ఒకప్పుడు పెద్దలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేవారు. అల్పాహారంలో ఇప్పుడు ఉన్నట్టు ఇడ్లీలు, దోసెలు వంటి ఫ్యాషన్ ఫుడ్లు అప్పుడు లేవు. ఒక తరం వెనక్కి వెళ్తే.. చద్దన్నం, గంజి అన్నం తినేవారు. అక్కడి నుంచి ఇంకో తరం వెనక్కి వెళ్తే.. రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటితో చేసిన ఆహారం తినేవారు. అందుకే అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు. వందేళ్ల పైబడి బతికేవారు. ఇప్పుడు సరైన తిండి ఏది? ఫ్యాషన్, టెక్నాలజీ అని చెప్పి షార్ట్ కట్స్ వెతుక్కుంటున్న సమాజం ఆరోగ్యం అంటే ఏంటో అన్న విషయమే మర్చిపోయింది.

ఏ పొలంలో చూసినా రసాయనాలే. ఏ ఇంట్లో చూసినా రసాయనాలతో పండిన ఆహారమే. పాల నుంచి నీళ్ల వరకూ.. టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకూ వేసుకునే ప్రతీ ఆహారం కల్తీనే. కూరగాయలు కల్తీ, బియ్యపు గింజలు కల్తీ, ఇడ్లీ పిండి కల్తీ, పిండ్లు కల్తీ.. ఇలా ఏది చూసినా కల్తీనే. హెల్దీ ఫుడ్ అనేది మాయమైపోయింది. ఏదో అక్కడక్కడ ఆర్గానిక్ ఫుడ్ పేరుతో దర్శనమిస్తుంది. ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన నికార్సైన ఆహార పదార్థాలను కొంతమంది మహానుభావులు.. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పండించి.. తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఉరుకులు, పరుగులు పెట్టే జనానికి దీని గురించి తెలుసుకునే సమయం, ఓపిక ఉండవు. అందుకే దీని మీద అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు. ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ మిల్లెట్స్ 2023 పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చిరుధాన్యాల ప్రాధాన్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 365 రోజులు ఉచితంగా టిఫిన్ అందిస్తున్నారు. హైదరాబాద్ లోని 365 ప్లేసెస్ లో, 365 రోజులు, 365 మందికి ఉచితంగా టిఫిన్ అందిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసినటువంటి టిఫిన్ ని వడ్డిస్తున్నారు.

ఈ టిఫిన్ వల్ల రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యం కూడా కలుగుతుందని అంటున్నారు. ఆరోగ్యకరమైన టిఫిన్ ని వివిధ వెరైటీల్లో వడ్డిస్తున్నారు. పొంగల్, దోస, ఇడ్లీ ఇలా వివిధ రకాల రుచికరమైన టిఫిన్స్ ని ఉచితంగా వడ్డిస్తున్నారు.హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీస్ లో రోజుకో ప్లేస్ లో.. 365 మందికి 365 రోజుల పాటు ఇలా ఉచితంగా టిఫిన్ పెడుతూ.. మనిషికి ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఇవాళ మనం తినే ఫుడ్ ఎంత కల్తీనో మనకి తెలిసిందే.

రసాయనాల ఫుడ్ వల్ల మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. డబ్బులు వృధా అవుతున్నాయి, దానికి తోడు జబ్బులు వస్తున్నాయి. అంత డబ్బు ఖర్చు పెట్టి జబ్బులను కొని తెచుకున్నట్టు అవుతుంది. అందుకే పూర్వీకులు వాడిన జొన్నలు, ఉలవలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. మరి మర్చిపోయిన మన సాంప్రదాయమైన ఆహారాన్ని మళ్ళీ గుర్తు చేస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.