విశాఖపట్నంలో భక్తులతో మాట్లాడుతున్న సాయిబాబా విగ్రహం.. వీడియో వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా రకరకాల వింతలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర భారత దేశంలో కొన్ని ఇల్లు బీట్లు చేసుకుని కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉంది. రకరకాల వింత వ్యాధులు.. మంచు తుఫాన్ ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో సాయిబాబా విగ్రహం భక్తులతో మాట్లాడటం సంచలనం రేపింది. గతంలో పలుచోట్ల కొన్ని దేవత విగ్రహాలు కళ్ళు తెరిచినట్లు వార్తలు రావడం తెలిసిందే.

ఆ సమయంలో తండోపతండాలుగా విగ్రహాలు చూడటానికి జనాలు రావటం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఏకంగా సాయిబాబా భక్తులతో మాట్లాడటం వార్త సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాయిబాబా విగ్రహం భక్తులు ప్రతిష్టించడం జరిగింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే భక్తుల ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను.. సాయిబాబా ఆశీర్వదిస్తూ ఉన్నాడు.

ఇదే సమయంలో భక్తులకు తన సూక్తులు కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విగ్రహాన్ని విశాఖనగరంలోని చినగదిలిలో గల సాయిబాబా ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాయిబాబా విగ్రహంలో కళ్ళు కదపటం తల ఆడించటం భక్తులను ఆకట్టుకుంటూ ఉంది. విశాఖపట్నంలో ఈ సాయిబాబా విగ్రహానికి బాబా భక్తులు పోటెత్తుతున్నారు.