రేపే ఉగాది స్నానం చేసే నీటిలో ఈఒక్కటి వేసుకొని చేస్తే 7 జన్మల దరిద్రం పోయి అపర కుబేరులే…

ఏప్రిల్ 2వ తేదీ శ్రీ శుభ కృత నామ సంవత్సరం ఆరంభం, ఈరోజు హిందువులు ఉగాది పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు పోతాయి,మానసిక ప్రశాంతత కలుగుతుంది. శరీరానికి నూతన శక్తి వస్తుంది, సంవత్సరం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు.మరి ఎంతో పవిత్రమైన ఉగాది రోజు, స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని చేస్తే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం.చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేసినాడు, దీనిని మనం ఉగాది పండుగ గా జరుపుకుంటున్నాం, ఉగాది లో ఊగా అనగా నక్షత్ర గమనం జన్మ అసిషూ అని అర్థాలు, వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్షు లకుమొదటి రోజు కాబట్టి, ఉగాది అని పిలుస్తారు.ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది, కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ, ఈరోజు కొత్తగా పనులు ప్రారంభించడం అనాదిగా వస్తోంది, బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా, సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించుకుని పోతాడు, వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దేవుడి దగ్గర లేదు .

ఆ బ్రహ్మ దేవుడు శ్రీమహావిష్ణును మనసులో ధ్యానించగా, శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువుతో ఇలా అంటాడు,దేవా నీకు తెలియంది ఏదీ లేదు, నీ వల్లే ఈ లోకాలన్నీ పొట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి, నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి, మహా సముద్ర గర్భంలో దాచాడు.ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు, అప్పుడు శ్రీహరి బ్రహ్మ తో ఇలా అంటాడు, బ్రహ్మదేవా విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రం లో ఎక్కడ ఉన్న సోమకున్ని వెతికి పట్టుకొని, సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను, అని సముద్రం లోకి వెళతాడు, సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు,కానీ అతనికి ఆకలి తీరలేదు, ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా, ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు, ఆవిధంగా శ్రీహరి సోమకాసురుడు మధ్య బీకర యుద్ధం జరిగింది.

సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవ్వడం వల్ల, వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో చాప రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు కోరలతో పొట్టను చీల్చి సంహరించెను, అతని కడుపులో ఉన్న వేదాలను ఒక దక్షిణావృత శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు.శ్రీహరి చేతిలో ఉన్న వేదాలను బ్రహ్మదేవుడు సంతోషించాడు, అప్పుడు శ్రీమహావిష్ణువువేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి, బ్రహ్మదేవాయ ఈ సృష్టిని కొనసాగించమని చెబుతాడు, ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే, ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేశాడు.. ఈరోజు ఎరుపు రంగులో ఉండే దుస్తులు, పింక్ కలర్ లో ఉండే దుస్తులు కట్టుకోవాలి, అలాగే పసుపు రంగు ఆరంజ్ కలర్ లో ఉండే దుస్తులను ధరించవచ్చు.

మొత్తం నాలుగు రంగులు అంటే ఎరుపు పింక్ యెల్లో, ఆరెంజ్,రంగులో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఈ రోజు పొరపాటున కూడా నలుపు నీలం రంగు దుస్తులను ధరించకూడదు, అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం. బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిలి పూజగది శుభ్రపరచుకుని, ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి,ఇక ఈ రోజు స్నానం చేసే నీటిలో మామిడి ఆకులు లేదా వేపాకులతో కూడిన వేప పువ్వులను వేసుకుని స్నానం చేయాలి, ఇలా చేస్తే సకల వ్యాధులు దరిద్రాలు దోషాలు పోతాయి, సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది, ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే తైలం తో తలంటి స్నానం చేయాలి, ఎందుకంటే ఈ రోజు తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగా దేవి కొలువై ఉంటారు, ఈ రోజు ఇలా చేయడం వల్ల మన శరీరం పవిత్రమైన కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి, కొబ్బరి నూనె నువ్వుల నూనె వాడవచ్చు, ఈరోజు తైలంతో తలంటి స్నానం చేయని వారు నరకానికి పోతారని పురాణవచనం…