ఉగాది 2022 తర్వాత గురు దశతో ఈ 5 రాశులకి అఖండ రాజయోగం.

ఏప్రిల్ 2 ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశులు ఏమిటో తెలుసుకుందాం. ఉగాది నుండి 12 రాశుల్లో 5 రాశుల వారికి గురువు సంచారం లో మార్పు వల్ల విశేషమైన రాజయోగం పట్టబోతోంది.గురువు ఏప్రిల్ 14వ తేదీ కుంభ రాశిలో నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 14 గురువు సంచారంలో మార్పు ఉన్నప్పటికీ దానికి ముందుగానే ఉగాది నుండి ద్వాదశ రాశుల మీద దాని ప్రభావం అనేది పనిచేస్తుంది.కాబట్టి ద్వాదశ రాశుల్లో గురువు సంచారం లో మార్పు వల్ల అద్భుతమైన రాజయోగం పట్టబోతున్న ఐదు రాశుల్లో మొదటి రాశి వృషభ రాశి. దీనికి కారణం ఏమిటంటే వృషభ రాశి నుండి చూసినప్పుడు గురు సంచారం మారినటటువంటి మీన రాశి పదకొండవ రాశి అవుతుంది.

వృషభ రాశి వారికి గురువు పదకొండవ సంచారం చేస్తున్నాడు. అందువల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.తర్వాత రెండవ రాశి కర్కాటక రాశి. ఈ రాశి నందు చూసినప్పుడు గురువు 9 వ సంచారం భాగ్య సంచారం. కాబట్టి కర్కాటక రాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది, శని సంచారం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇన్నాళ్లు అష్టమ గురు సంచారం వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల, గురువు భాగ్య సంచారం వల్ల అనుకోకుండా అదృష్టం కలిసివస్తుంది. దాని వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు.

మూడవ రాశి కన్యారాశి. ఈ రాశినుండి చూసినప్పుడు గురువు సంచారం మారిన మీనరాశి ఏడవ రాశి అవుతుంది, గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు. అందువల్ల పెళ్లి కావాల్సిన వారికి ఉగాది తర్వాత కచ్చితంగా పెళ్లి అవుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు కన్యా రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆ గొడవలు పూర్తిగా పోతాయి.పార్ట్నర్ షిప్ బిజినెస్లో ఉగాది తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, దానికి కారణం ఉగాది తర్వాత నుండి కన్యా రాశి వారికి సప్తమ గురు సంచారం రాబోతుంది. కాబట్టి వివాహము, దాంపత్యము, పార్టనర్ బిజినెస్ లో కన్యా రాశి వారికి విశేషంగా అదృష్టం కలిసివస్తుంది. తర్వాత నాలుగో రాశి వృశ్చిక రాశి. ఈ రాశి నందు చూసినప్పుడు గురువు సంచారం జరిగిన మీన రాశి ఐదవ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి పంచమ గురు సంచారం జరుగుతుంది.దీనివల్ల సంతానం లేని వారికి కచ్చితంగా ఉగాది తర్వాత సంతానం ప్రాప్తిస్తుంది.

అదేవిధంగా వృశ్చిక రాశి వారు భగవంతుని అనుగ్రహం ఎక్కువగా పొందుతారు, ఈ వృశ్చిక రాశి వారికి పిల్లల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పిల్లలు ఎడ్యుకేషన్ లో బాగా రాణిస్తారు.తర్వాత ఐదవ రాశి కుంభరాశి. ఈ కుంభ రాశి నుండి చూసినప్పుడు గురు సంచారం మారిన మీనరాశి రెండవ రాశి అవుతుంది. కుంభ రాశి వాళ్ళకి ధన స్థానంలో గురు సంచారం జరుగుతుంది, అంటే కొత్త సంవత్సరంలో కుంభ రాశి వారికి డబ్బులే డబ్బులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రెండవ సంచారం అంటే అది వాక్ స్థానానికి సంబంధించిన సంచారం, కుటుంబ స్థానానికి సంబంధించిన సంచారం, ధన స్థానానికి సంబంధించిన సంచారం, కాబట్టి కుంభరాశి వారి మాటకు తిరుగు ఉండదు.తన పరంగా విపరీతంగా కలిసివస్తుంది, కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ తొలగింప చేసుకోవచ్చు, కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 14 గురు సంచారం లో మార్పు జరగబోతుంది. కాబట్టి దాని ప్రభావం ఉగాది నుండి కొంత వరకు ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత వృషభ రాశి , కర్కాటక రాశి ,కన్యా రాశి, వృశ్చిక రాశి కుంభరాశి. ఈ 5 రాశుల కి రాజయోగం అనేది పట్టబోతుంది.