రేపే నాగ పంచమి ఈరోజు నాగేంద్రుడికి ఈ ఒక్కటి సమర్పిస్తే ఊహించని అదృష్టం చూస్తారు..

నాగపంచమి. ఈరోజు నాగేంద్రుడికి ఈ ఒక్కటి సమర్పిస్తే నెల తిరిగేసరికి కలలో కూడా ఊహించని అదృష్టాన్ని చూస్తారు. అంతే కాదు నాగ పంచమి అంత సామాన్యమైన రోజు కాదు, ఈరోజు ఇలా చేస్తే అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి. మరి నాగేంద్రుడికి ఏమి సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. నాగపంచమి రోజు ఏమి చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాo.ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికే సంవత్సరం పొడవున ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి.

అంతా అనుకూలంగా ఉంటుంది, భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో నాగసర్పం కూడా దైవస్వరూపమే, వేయిపడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణం, వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు కశ్యప ప్రజాపతికద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు వాసుకి నవనాగుడు, శంకుడు కర్కోటకుడు పిండారకుడు, హంషుడు ఐరావతుడు మొదలవారు జన్మించి కనపడిన వారి నెల్ల కాటు వేస్తూ భయభ్రాంతులకు గురి చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి, తల్లి శాపానికి గురైన వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాతమందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించే మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమాని వేడుకున్నారట. విషయుప్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటు వేసి ప్రాణకోటిని నశింప చేయడం తప్పు కాదా, నిష్కారనముగా ఏ ప్రాణిని హింసించ కూడదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధమైన సమీతులను తప్పించుకు తిరగండి.

దేవతావిహంగా గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయభక్షకులై సాగు జంతువులు గా మారండి మీ నాగులంతా, అతల వితల పాతాళ లోకంలో నివాసం ఉండండి. అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు, భూలోక వాసులంతా ప్రార్థన చేశారు నాగులకు, దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగుల జన్మదిన నాగ పంచమి రోజున వాటిని పూజ చేయడం మొదలుపెట్టారు. వైదిక కాలం నుంచి కూడా శ్రావణ మరియు కార్తీక మాసంలో పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం ఈ దేశమంతా ఉంది.పుట్టలో ఆవు పాలు వడపప్పు చలివిడి అరటి పండ్లు జార విడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా నాగ పంచమి రోజున మీరు కూడా చేసినట్లయితే ఎటువంటి కష్టాలు ఉన్న తొలగిపోతాయి.