లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్.. అధికారుల‌తో గొడ‌వ‌కు దిగిన కేటీఆర్‌.. వీడియో !

తెలంగాణ రాష్ట్ర Telangana మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ KCR  కూతురు బీ.ఆర్.ఎస్ BRS MLC Kavitha ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడి అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెను అరెస్టు చేశారు. అయితే ఆమెకు సెర్చ్ వారంట్ తో పాటు అరెస్టు వారెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ నేతలు ఆమె ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం కవిత ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బీజేపీ మరియు ఈడి అధికారులను బీ.ఆర్.ఎస్ నేతలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో Liquor scam case కవిత Kavitha దొరికిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కవిత నివాసంలో తాజాగా ఈడి మరియు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడి అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.అయితే గతంలో ఈ స్కామ్ లో దొరికినప్పుడు కూడా కవితను పలుమార్లు ఈడీ అధికారులు విచారణ చేశారు. ఇక ఆ సమయంలో ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ఢిల్లీ సీఎం ను కూడా దర్యాప్తు సంస్థలు విచారణ చేశాయి.

అయితే ఇప్పుడు ఆయనను కూడా అరెస్టు చేసినట్టు ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ ఇలాంటి కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతుందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ మరో 24 గంటల్లో వస్తుంది అనంగా కవిత ఇంటిపై ఈ విధంగా దాడులు ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కవితపై దాడులు చేసి అరెస్టు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనియాంశంగా మారింది.

Kavitha Arrested అధికారుల‌తో గొడ‌వ‌ : కేటీఆర్‌ KTR : ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్ అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారుల పైన మండిపడ్డ కేటీఆర్