వాల్ నట్స్ తినటానికి ఒక సమయం ఉంటుందని తెలుసా..ఎప్పుడు తినాలి…?

బాదం,జీడిపప్పు,కిస్ మిస్, అంజీర్,ఆక్రోట్,వాల్ నట్స్ అనేది డ్రై ఫ్రూట్స్. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి.వీటిలో ఈ రోజు వాల్ నట్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డ్రై ఫ్రూట్స్ వాడకం కూడా బాగా పెరిగింది.ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ తినటానికి అలవాటు పడ్డారు. వాటిలో ఉన్న పోషకాల గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకొని తింటున్నారు.చాలా మంది వాల్ నట్స్ తింటే మెదడు ఆరోగ్యం చాలా బాగుంటుందని ,జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని భావిస్తారు. కానీ వాల్ నట్స్ తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అయితే చాలా మంది వాల్ నట్స్ తినటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాల్ నట్స్ రుచిలో కాస్త వగరు ఉంటుంది. వాల్ నట్స్ నీటిలో నానబెట్టి తింటే మంచిది. మూడు వాల్ నట్స్ ని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి. తొక్క తీయకపోతే తొక్క వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. వాల్ నట్స్ నానబెట్టి తినటం వలన తేలికగా జీర్ణం అవుతుంది.వాల్ నట్స్ లో కార్బోహైడ్రేడ్స్,కొవ్వు పదార్ధాలు,సోడియం,పొటాషియం,పీచు ,విటమిన్స్,మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

వాల్ నట్స్ లో అసలు కొలస్ట్రాల్ ఉండదు. ఇప్పుడు నీటిలో నానబెట్టిన వాల్ నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ విషయాలను తెలుసుకుంటే వాల్ నట్స్ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతలా వాల్ నట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండుట వలన ఒత్తిడి,ఆందోలన తగ్గించటంలో సహాయపడతాయి. అంతేకాక మూడ్ మెరుగుదలకు కూడా సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఉండే పొటాషియం,మాగ్నీషియం,జింక్ వంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచి జీర్ణ సంబంధ సమస్యలు గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.మధుమేహాన్ని అదుపు చేసే లక్షణాలు వాల్ నట్స్ లో సమృద్ధిగా ఉన్నాయి. ప్రతి రోజు మూడు నానబెట్టిన వాల్ నట్స్ తింటే టైప్ 2 డయాబెటిస్ వారికీ చాలా మంచిది. నానబెట్టిన వాల్ నట్స్ తినటం వలన రక్తంలో చెడు కొలెస్టరాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

వాల్ నట్స్ తినటం వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికీ ఇది మంచి ఆహారం అని సెహెప్పాలి. వాల్ నట్స్ బరువును తగ్గించటమే కాకుండా బరువు పెరగకుండా కూడా చేస్తుంది.వాల్ నట్స్ లో ఉండే మెలటోనిన్ ఉండుట వలన మంచి నిద్ర పడుతుంది. దాంతో నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.వాల్ నట్స్ ను ప్రతి రోజూ తీసుకోవడానికి మరో కారణం వీటిలో ఉండే కాంపౌండ్స్ వల్ల పొట్టలో పెరిగే పిండంకు ఎలాంటి అలర్జీలు కలగకుండా వాల్ నట్స్ తగిన వ్యాధినిరోధకతను పెంచుతాయి. వాల్ నట్స్ మెదడు మీద ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. వాల్ నట్ లో విటమిన్ ఇ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉండి, జ్ఝాపకశక్తిలోపానికి గురిచేసే, హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్ ను నాశనం చేస్తుంది.వాల్ నట్స్ ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నానబెట్టిన వాల్ నట్స్ ని ఉదయం పరగడుపున తినవచ్చు. లేదా రాత్రి పడుకొనే ముందు తినాలి. ఈ విధంగా తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు బాగా అందుతాయి. మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న వాల్ నట్స్ ని తినటానికి ప్రయత్నం చేయండి.