శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.. వీడియో

చికాకు, కోపం, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, నీరసం, నడుము నొప్పి, కూర్చొని లేసేటప్పుడు ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రెండు కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. కిడ్నీలు మన శరీరంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి, రక్తాన్ని శుభ్రపరచడంలో లో కిడ్నీలు పోషక పాత్ర పోషిస్తాయి.

అలాగే కిడ్నీలు విటమిన్ డి ని తయారు చేయడంలో సహాయపడతాయి. అలాంటి కిడ్నీలలో లోపాలు ఉంటే శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మూత్రం రంగు మారిన, అసాధారణ మార్పులు కనిపించిన కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గిపోతాయి. వికారం, వాంతులు అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గిపోతారు. శరీరంలో వ్యర్ధాలు బయటికి పోకపోతే శరీరంలో మొఖం, కాళ్లు వాపులుగా కనిపిస్తాయి. కిడ్నీల తీరు మందగించడం వలన ఎర్ర రక్త కణాలు సంఖ్య తగ్గిపోతుంది.

ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీలు పాడైపోతే అవి ఉండే స్థానంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఏ విషయంలో ఏకాగ్రతగా ఉండలేరు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవాలి. ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలకు హాని కలిగించే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అలాగే వెల్లుల్లి తినడం వలన రోక నిరోధక శక్తి పెరిగి కిడ్నీలు పాడవకుండా కాపాడుతాయి. అలాగే పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఓట్స్ నీ ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి.