సమంతతో విడాకులు తీసుకుంటున్నాను.. షాక్ ఇచ్చిన చైతూ!

ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భయంకరమైన వార్తపై మొత్తానికి నాగ చైతన్య కుండ బద్దలు కొట్టేశాడు. సమంతతో విడాకులు తీసుకోబోతున్నట్లు ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే అక్టోబర్ 6న నాలుగవ యానివర్సరీ సందర్భంగా ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారట. కానీ సమంత ముందుగానే చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక అక్కినేని నాగ చైతన్య సోషల్ మీడియాలో ఒక వివరణ కూడా ఇచ్చాడు.

https://youtu.be/KBkfBO55Mcg

మా శ్రేయోభిలాషులందరికీ తెలియజేస్తున్నాను అంటూ చాలా చర్చల తరువాత ఆలోచించి సమంత నేను భార్య భర్తల బంధం నుంచి విడుపోతున్నాం అని పేర్కొన్నారు. నేను భర్తగా విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె సొంతంగా మంచి మార్గాలను అనుసరించాలని కోరుకుంటున్నాను.ఇక ఆమెతో స్నేహం చేయడం చాలా అదృష్టం అంటూ మేము ఎల్లప్పుడూ కూడా మంచి స్నేహంతో ఉంటాము అని అన్నాడు.

ఇక ఈ సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులను అలాగే మీడియా కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏమిటంటే ఈ క్లిష్ట సమయంలో మాకు ప్రైవసీ అవసరం.. అంటూ నాగచైతన్య పూర్తి విషయాన్ని క్లియర్ గా తెలియజేశారు. ఇక నాగచైతన్య ఈ విషయం చెప్పడంతో అభిమానులు చాలానే అప్సెట్ అవుతున్నారు.