30 రూపాయలకు కక్కుర్తి పడితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ గా ఉండండి ….

మామూలుగా అందరికీ ఏదైనా చిన్న డిస్కర్షన్ వచ్చిన అది నా పర్సనల్ విషయం నీకెందుకు అని అంటారు. పర్సనల్ అంటే మన సొంత ది అని అర్థం, జనరల్ విషయాలు కాకుండా ప్రతి వారికి కూడా పర్సనల్ థింగ్స్ కచ్చితంగా ఉండాలి ,ఉంటాయి కూడా. మన పర్సనల్ థింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఉదయం లేచింది మొదలు బ్రష్ చేసుకోవడం తో స్టార్ట్ అవుతాయి. పర్సనల్ బ్రష్, పర్సనల్ టంగ్క్లీనర్, పేస్ట్అనేది అందరితో పాటు షేర్ చేసుకుంటారు, అది పర్సనల్ కాదు. దాంతోపాటు మనం వాడుకునే దువ్వెనలు, పౌడర్ పఫ్ , ఇతర మేకప్ కిట్ లు ఏమైనా ఉంటే వాటిని కూడా పర్సనల్ థింగ్స్ గా ఉంచుకోవాలి. ఇలా పర్సనల్ థింగ్స్ ఉంచుకోవడమే కాకుండా వీటిని మోస్ట్ హైజిఎనిక్ గా ఉంచుకోవడం కూడా అత్యంత అవసరమైన విషయం. చాలామంది ఎక్కువగా మేకప్ చేస్తూ చాలా అందంగా తయారవుతారు. కానీ టూత్ బ్రష్ ను మాత్రం మార్చారు , బ్రష్ ఒక నెల మించి వాడకూడదు అంటారు.మాక్సి మమ్ త్రీ మంత్స్ వరకు మాత్రమే టూత్ బ్రష్ ను వాడాలి, బ్రష్ ను మార్చకపోతే నోటి లోపల ఉండాల్సిన హెల్ది థింగ్స్ అనేది ఉండవట.

పైగా మన బ్రష్ లు అన్నీ కూడా మొత్తం ప్లాస్టిక్ తోనే తయారైనవి, వాటిలో క్రీములు ఎక్కువగా ఉంటాయి, మనం వాటిని జనరల్ గా బాత్రూం లోనే ఎక్కువగా పెట్టుకుంటారు.పూర్వకాలంలో పెరట్లో అలా పెట్టుకునేవారు, ఇప్పుడు బాత్రూంలో పెద్దవిగా ఉండటంతో పేస్టు, సబ్బులు, బ్రష్ లు, బాడీ స్క్రబ్బర్ ఇవన్నీ కూడా మనం బాత్ రూములోనే పెట్టుకుంటున్నాం. బాత్ రూమ్ మనం నిత్యం క్లీన్ చేసుకుంటున్నా సరే అక్కడ క్రీములు అనేవి తప్పనిసరిగా ఉంటాయి, కాబట్టి బాత్రూం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఈ పరిస్థితులలో మనం బ్రష్లను బాత్రూంలో పెట్టకుండా ఉంచుకోవాలి. ఇలాకాకుండా మనకు బాత్రూం లోనే అన్నీ సౌకర్యాలు ఉన్నప్పుడు మనం బ్రష్ లను మిగతా వాటిని అన్నిటిని శుభ్రంగా ఉంచుకోవాలి. బ్రష్ వేసుకునే ముందు టూత్ బ్రష్ ను హాట్ వాటర్ తో కడిగి వేసుకోవడం చాలా మంచిది. రెండు నెలల తర్వాత టూత్ బ్రష్ లను వెంటనే మార్చేయాలి, ఇలా చేయకపోతే కనుక చాలా రకాల క్రీములు మన నోట్లో వేసుకున్నట్లు అవుతుంది.

కొంతమంది బ్రష్ వేసుకుని వచ్చి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు, ఇది చాలా చాలా చెడ్డ అలవాటు, ఇలా పళ్ళు తోముకునే టప్పుడు మాట్లాడకూడదు, ఆ తుంపర్లు అనేది ఎదుటి వారిపై మరియు ఇల్లంతా కూడా పడుతూ ఉంటాయి తద్వారా క్రీములు ఇల్లంతా వ్యాపిస్తాయి. అందుకనే ఒక దగ్గర కుదురుగా ఉండే బ్రష్ చేసుకోవాలి. ముఖం కడిగిన తర్వాత ఇంటిల్లిపాది అంతా ఒకే టవల్తో తుడుచుకోవడ0 , ఇలా చేయకూడదు హ్యాండ్ టవర్ మరియు ఫేస్ టవల్ను సపరేట్ గా ఉంచుకోవాలి. తర్వాత దువ్వెన విషయానికి వస్తే అందరూ ఒకే దువ్వెన తో తలను దువ్వు కుంటారు, దువ్వెనలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఒక మగ్గు లో హాట్ వాటర్ తీసుకొని కొద్దిగా వంటసోడాను మరియు కొద్దిగా సోప్ లిక్విడ్ ను వేసి నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత చూస్తే దువ్వెన లో అసలు మురికి అనేదే ఉండదు, మీరు బ్రష్ చేసి వాడేసిన పాత బ్రష్ తో ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది,చాలా శుభ్రం గా తయారవుతాయి. ఇంట్లో కొంతమందికి పేలు డాండ్రఫ్ ఇలాంటివి ఉంటాయి, ఇలా ఒకరి దువ్వెనతో మరొకరు దువ్వడంతో ఒకరి డాండ్రఫ్ మరొకరికి వస్తూ ఉంటాయి,అందువల్ల ఇలాంటి పద్ధతిని పాటించండి.