ఆగష్టు 05 వరలక్ష్మీ వ్రతం రోజు గుర్తుపెట్టుకుని ఈ రంగు గాజులు వేసుకుంటే మీ కోరికలు తీరుతాయి…

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తుంది. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి యొక్క భార్య, శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ పేరుతో వచ్చే మాసం శ్రావణం. చాంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదవ నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకి ప్రశస్థి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పండుగ ముత్తైదువులకు ఎంతో విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహం అయిన మహిళలు నిర్వహిస్తారు, ఈ రోజున దేవతలను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులతో పాలుపంచుకుంటారు.అయితే ఈ రోజున అమ్మవారిని ఈ గాజులు వేసుకుని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపద క్రమశిక్షణ ,ప్రేమ ,మనశ్శాంతి,సంతోషం ,ఇలాంటివి లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారూ. అయితే శాస్త్రాల ఆధారంగా చెప్పబడిన ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు అమ్మాయిలు చేతులకి ఏ గాజులు వేసుకుని వరలక్ష్మి వ్రతం నోచుకుంటే మీకు సకల సంపదలో కలుగుతాయో తెలుసుకుందాం.

ఈ ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం రానుంది, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈసారి అష్టమి తిధితో కూడుకొని వచ్చింది కాబట్టి బయట దేవాలయాలలో ఇంటిదగ్గర పందిళ్లు వేసి లేకపోతే గృహంలో ఎవరైతే వరలక్ష్మీ వ్రతం దోచుకుంటున్నారో వారు కొంచెం ఈసారి జాగ్రత్త వహించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆరెంజ్ లేదా పసుపు రంగు గాజులు వేసుకునే స్త్రీలో వరలక్ష్మీ వ్రతాన్ని గావించినట్లయితే అమ్మ వారి కృప కటాక్షాలు మీపై మెండుగా ప్రసరిస్తాయి. అమ్మవారికి పసుపు లేదా ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని గాజులలో పూజలకు సంబంధించిన గాజులు ఉంటాయి కదా వాటిని ధరించండి ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అంతేకాకుండా అస్సలు ఎక్కడా కూడా బ్లాక్ కలర్ అనేది రాకూడదు, బ్లాక్ డాట్స్ లేదా బ్లాక్ గీతలు కానీ అలా లేకుండా క్లీన్ గా ఉన్నటువంటి గాజులను వేసుకోండి ఇలా చేయడం వల్ల కచ్చితంగా మీ భర్త పూర్ణ ఆయుష్కుడు అవుతాడు, మీకు మాంగల్య భాగ్యం లభిస్తుందని చెప్పుకోవచ్చు.

సూత మహాముని, సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అనుకుంటాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములలో కల్పించే వ్రతం ఒక్కటే పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతం నా శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఇక పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర సౌఖ్యదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏమిటో సెలవుఇవ్వండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆవ్రతం శ్రావణమాసంలో శుక్లపక్షంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఇంతకుముందు ఎవరైనా చేశారా ఆ వివరాలు అన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని అన్నాడు.