ఇక ఇలా పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు

ఇలా పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్ష, కేంద్రం కొత్త బిల్లుతో షాక్ తప్పదా, అయితే 1000 అబద్దాలాడైనా ఒక్క పెళ్లి చేయాలి, అన్నా నానుడి ఎవరు అవునన్నా కాదన్నా అది ముమ్మాటికీ తప్పు. అవునా కాదా కానుకల కోసం లేదంటే పెళ్లి అవ్వడం కోసం ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసేయాలి, అని ఎన్నో అబద్ధాలు చెప్పడం వారి గురించి చాలా విషయాలు దాయడం ఇంకా చెప్పాలి అంటే, గుర్తింపే దాచిపెట్టి పెళ్లి చేసుకొని మోసం చేసిన ఉదంతాలు చాలా చూశాం. అయితే దేశంలో ఈ కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఐపీసీ సీఆర్ పీ సి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో, మూడు కొత్త బిల్లులని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.

అయితే వీటిపై మరింత అధ్యయనం అవసరం కాబట్టి నిపుణుల కమిటీకి సిఫారసు చేశారు. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లులలో కీలకమైన ఈ ఐపిసి స్థానంలో వస్తున్న, భారతీయ న్యాయ సంహిత బిల్లులో పెళ్లిలకు సంబంధించి ఒక కీలక ప్రతిపాదన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా చోట్ల పెళ్లిళ్లతో సంబంధించి మోసాలు పెరిగిపోతున్నాయి కదా, ఇందులో ముఖ్యంగా గుర్తింపు దాచే మహిళలను పెళ్లి చేసుకోవడం, తర్వాత వాళ్లని మోసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. దీన్నే దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాజా బిల్లులో ఒక మార్పును ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఇలాంటి కేసులకు నిర్దిష్టమైన శిక్షలు ఐపిసి లో లేకపోవడంతో, దీని స్థానంలో వస్తున్న భారతీయ న్యాయ సంహిత బిల్లులో, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించేలా ప్రతిపాదిస్తున్నారు.

తాజా బిల్లు ప్రకారం పెళ్లి పేరుతో ఈ పదోన్నతి పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తానని పేరుతో, తప్పుడు వాగ్దానాలు చేసి మహిళలను లైంగికంగా వాడుకుంటే, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష. అలాగే గుర్తింపును దాచి పెట్టి పెళ్లి చేసుకుని మోసం చేసిన ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇందులో మహిళలపై ఈ నేరాల కు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు చెప్పారు. మహిళలపై నేరాలు వారు ఎదుర్కొంటున్నా అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించారు. తొలిసారిగా ఈ పెళ్లి ఉద్యోగం పదోన్నతి తప్పుడు గుర్తింపు వంటి తప్పుడు వాగ్దానాలతో, మహిళలతో లై ంగిక చర్యలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు ఇప్పటివరకు ఈ పెళ్లి చేసుకుంటారని మోసం చేసి, అత్యాచారాలకు పాల్పడ్డట్టు మహిళలు ఏవైతే పిటిషన్స్ వేశారు అంటే దాఖలు చేసినటువంటి కేసులకు సంబంధించి విచారణలు జరుగుతున్నాయి. అయితే ఈ ఐపీఎస్ దీనికి సంబంధించి పర్టికులర్గా నిర్దిష్ట శిక్ష అనేది ఒక నిబంధన లేదు అందుకే, ఈ బిల్లులో కొత్త నిబంధన పెట్టారు.