ఇది తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మన శరీరంలో రక్తప్రసరణ రక్తనాళాల గుండా జరుగుతూ ఉంటుంది. ఈ రక్తప్రసరణ అన్ని అవయవాలకి సక్రమంగా చేరినప్పుడే, అన్ని అవయవాలు అవి చేయవలసిన పనులు అన్నిటిని సవ్యంగా చేస్తాయి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఏ భాగానికి అయినా అందదు ఆ భాగానికి సమస్యలు తలెత్తడం, ఆ భాగాలు డ్యామేజ్ అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మరి రక్తప్రసరణ జరగడానికి ఆటంకం కలిగించేవి రక్తనాళాలలో పూడికలు. ఇవి కొవ్వు పేరుకొనే అవకాశాలు ఉంటాయి రక్తనాళాల గోడలకి, కొలెస్ట్రాల్ కూడా పేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి.ఈ కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడలలో పేరుకుని ఉంటుంది అలాగే కొవ్వు కూడా పేరుకుని ఉంటుంది, ఎప్పుడైతే రక్తనాళాలలో కొవ్వు కొలెస్ట్రాల్ లాంటివి పనికిరాని హాని కలిగించే పదార్థాలు పేరుకుంటూ ఉంటాయో, అప్పుడు రక్తనాళాలలో పూడికలు వస్తాయి కదా , కాలువలో కంప, చెత్త లాంటిది అడ్డుపడితే నీటి ప్రయాణానికి ఎలాగైతే ఆటంకం కలుగుతుందో, అలాగే మన రక్తనాళాలలో కూడా ఇలాంటివి వస్తే కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.

మరి రక్తనాళాలు పూడికలు ఎక్కడైతే వచ్చి ఆటంకం కలిగిస్తాయో దిగువ భాగానికి రక్తప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది, తద్వారా ఆ దిగువ భాగాలన్నీ కాస్త రక్త ప్రసరణ అందలేదు అనుకోండి గాలినీరు పోషకాలు అందక ఇబ్బంది పడుతూ ఉంటాయి. మరి ఇలాంటివి ఇతర అవయవాలలో వచ్చినప్పుడు ప్రాణం పోదు కానీ హార్ట్ లో రక్తనాళాల పూడికలు వచ్చిన మెదడులో రక్తనాళాల పూడికలు వచ్చిన ప్రాణమే పోతుంది. అందుచేత ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెట్టి చంపేసే మొట్టమొదటి ప్రాణాంతక జబ్బు హార్ట్ స్ట్రోక్స్. అలాగే ఎక్కువ మందిని మంచం మీద పడేటట్లు చేసి ఎవరి చేతనైనా చేయించుకునే స్థితికి వచ్చేట్టు చేసేది బ్రెయిన్ స్ట్రోక్స్.

ఈ రెండు స్ట్రోక్స్ లకి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలలో పేరుకోవడం, అలాగే కొవ్వు కూడా ఎక్కువగా రక్తనాళాలలో పేరుకోవడం, ఇలాగా పేరుకునేదాన్ని నివారించగలిగిన పేరుకునే స్థితిని మనం తగ్గించగలిగిన ఇలాంటి రెండు సమస్యల నుండి బయటపడవచ్చు. మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలలో పేరుకోకుండా ఉండడానికి, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ ఇవన్నీ ఉన్న ఆహారాలు బాగా తీసుకున్నాం అనుకోండి పూడికలు రాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా రక్షించడానికి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ లభించే చవకైన ఆహారం అవిస గింజలు ఇవి చాలా ఉత్తమమైనది, ఇతర విత్తనాల వలె సుమారు 550 క్యాలరీల శక్తి వస్తుంది సుమారుగా 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది 42 గ్రాములు కొవ్వు ఉంటుంది, ఈ అవిసగింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి. ఇవి తినడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్ బ్లడ్ వెజల్స్ లో ఫ్యాట్స్ రాకుండా నివారించడానికి అలాగే హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రెండున్నర లక్షల మంది మీద అమెరికాలో 2018లో “హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్” వీళ్లు పరిశోధన స్పెషల్ గా చేశారు.