ఇలాంటి గొప్ప మొక్క గురించి తెలుసుకోవడం మన అదృష్టం. అందరికీ తెలియజేయండి.

ఈ మొక్క పల్లెల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మొక్కను నల్లేరు అంటారు.. ఇది దళసరి కాండంకలిగిన మొక్క, ఇది భారతదేశంలో సాంప్రదాయ వైద్యంతో పాటు వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నల్లేరు మొక్కను ఔషదాల తయారీలో చాలా బాగా ఉపయోగ పడుతుంది అని ప్రసిద్ది.. భారతీయ ఔషధం పురాణ గ్రంథాల ప్రకారం, ఎముకల లో వచ్చిన పగుళ్లను నివారించడంలో నల్లేరు మొక్కచాలా బాగా ఉపయోగ పడుతుంది. అలాగే పొట్టలోని చెడు గాలి , అజీర్ణం, బరువు తగ్గడం, మూర్ఛ వ్యాధి , లైంగిక కోరికలు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

ఈ మొక్క ను హిందీ పరి భాషలో హడ్జోడ్ అని పిలుస్తారు, ద్రాక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్కను తెలుగులో “నల్లెరు”, తమిళంలో “పిరంటై”, కన్నడలోని “మంగరహల్లి”మరియు మలయాళంలో “కన్నలంపరంత” వంటి అనేక ఇతర ఇతర రకాలు గా స్థానికంగా ఉండే వారు పిలుచుకుంటారు. ఈ మొక్క ను శాస్త్రీయంగా సైంటిఫిక్గా సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అని పిలుస్తారు, మానవుల ఎముకల యొక్క కణజాల అభివృద్ధికి మరియు విరిగిన ఎముకలు అతుక్కోవడానికీ ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు ఔషదంగా బాగా గుర్తింపు పొందింది. ఈ మొక్క ను ఔషదా పరంగా క్యాప్సూల్స్, టాబ్లెట్లు మరియు పౌడర్ల తయారిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

నల్లేరు మొక్కలో చాల పోషక విలువలు ఉన్నాయి.ఈ నల్లేరు మొక్క లెక్కలేనన్ని ఉపయోగకరమైన భాగాలతో ఉంటుంది, అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్, రెస్వెరాట్రాల్ మరియు ఫ్లేవనాయిడ్లు కాకుండా కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క విస్తారమైన నిల్వలు ఉంటాయి. ఈ మొక్క “బోన్ సెట్టర్” గా లేదా “ఎముకలను నాశనం నుండి రక్షించేది” అని సంస్కృతంలో పిలుస్తారు. ఈ నల్లేరు మొక్కలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, జింక్ మరియు సోడియం వంటి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంది, ఇవన్నీ ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని అందిస్తాయి.ఇలాంటి గొప్ప మొక్క గురించి తెలుసుకొని అందరికీ తెలియజేయండి.