ఈనూనె గురించి అన్ని ఊర్లలో చెప్పుకుంటున్నారంట మొదటిసారి వీడియోపెడితే చూసినవారందరికి బట్టతల మీదజుట్టు…

జుట్టు పల్చబడిన వారికి మగవారిలో అయితే బట్టతల ఉన్నవారికి, ఇలా జుట్టు సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా బాగా జుట్టు పెరగడానికి ,జుట్టు నల్లగా ఉండడానికి ,బట్టతల ఉన్నవారికి వెంట్రుకలు మొలవడానికి ఒక చిట్కా తెలుసుకుందాం!మొదటగా రెండు ఉల్లిపాయలను తీసుకోవాలి, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, ఈ ఉల్లిపాయలను మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు దీంట్లో ఆవ నూనె రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని అర కప్పు వరకు వేసుకోవాలి, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక కప్పు వేసుకోవాలి.ఇందులో కొంచెం కూడా వాటర్ ను కలపకూడదు ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

తర్వాత ఇనుప కడాయి తీసుకుని దాంట్లో ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి, తర్వాత 100 గ్రాముల ఆవనూనెను వేసుకోవాలి, అలాగే కొబ్బరి నూనెను కూడా 100 గ్రాముల వరకు వేసుకోవాలి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి , ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని వేడి చేసుకోవాలి, కొబ్బరి నూనె ప్యారాచూట్ నూనె తీసుకుంటే మంచిది,తర్వాత 100 గ్రాముల ఆముదాన్ని వేసుకోవాలి ఆముదం వల్ల జుట్టుకి మంచి ప్రయోజనాలు ఉంటాయి.ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి .

ఇప్పుడు దీన్ని బాగా నురుగు వచ్చేవరకు బాయిల్ చేసుకోవాలి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూనే ఉండాలి, కడాయి మాత్రం కేవలం ఇనుపది మాత్రమే పెట్టుకోవాలి, దీన్ని బాగా చల్లారనివ్వాలి, ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని ఒక గాజు సీసాలో పోసుకుని నిల్వచేసుకోవాలి. ఈ నూనెను మీరు తల మొత్తం రాసుకోవాలి, తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి, తర్వాత కొద్దిసేపు జుట్టును ముడి వేసుకొని ఉండాలి, ఇలా రెండు గంటల పాటు ఉంచుకోవాలి, ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి, దీనిని వారానికి మూడుసార్లు కచ్చితంగా రాసుకోవాలి, దీన్ని ఎప్పుడు రాసుకున్న సరే ఒక చిన్న గిన్నెలో తీసుకుని రాసుకోవాలి, ఇలా చేస్తే బట్టతల ఉన్నవారికి కూడా మంచిగా జుట్టు వస్తుంది.