ఈ ఆకు వారంలో 2 సార్లు తింటే ఎముకలు బలంగా,గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక మరెన్నో లాభాలు

 ఆకుకూరలను తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. కాబట్టి ఆకుకూరలను అసలు మానకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు చాలా చవకగా ఎక్కువ పోషకాలతో దొరుకుతాయి.ఆకుకూరల్లో రారాజు తోటకూర. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ, అన్ని రకాలలోను ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. తోటకూరతో చేసే వంటలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలును చేస్తాయి. తోటకూరను తినటానికి చాలా మంది ఇష్టపడరు. ప‌స‌రు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చాలా మంది అనుకుంటారు.కానీ అది నిజం కాదు. తోట‌కూర అలా అనిపిస్తుంది అంతే. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి తోట‌కూర‌ను తింటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.తోటకూరలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ‘ ఎ’ తో పాటు విటమిన్ కె, సి, బి6, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి.తోటకూర శరీరానికి కావల్సిన శక్తిని సమకూర్చుతుంది. తోటకూర ఆకుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్,ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తలేమి(అనీమియా)తో బాధపడేవారికి మంచి ఔషధంగా చెబుతారు.రక్తలేమితో బాధపడేవారు ప్రతి రోజు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్య నుండి బయట పడతారు.ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు.బరువు తగ్గాలని అనుకొనే వారు రోజువారీ డైట్ లో తోటకూరను చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. తోటకూరలో ఉండే ఫైబర్  జీర్ణక్రియను మెరుగుపరచి కొవ్వును తగ్గిస్తుంది. తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టు కుంటుంది. మాంసంకు స‌మానంగా ప్రోటీన్లు తోట‌కూర‌లో ఉంటాయి. తోట‌కూర తింటే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. శ‌రీరం దృఢంగా మారుతుంది. నిత్యం వ్యాయామం చేసేవారు తోట‌కూరను క‌చ్చితంగా తినాలి. తోట‌కూర‌లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. ఎముక‌ల‌కు బ‌లం చేకూరుస్తుంది. ఎదిగే పిల్ల‌ల‌కు తోట‌కూర పెడితే వారిలో ఎదుగుద‌ల స‌క్ర‌మంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది.. నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. తోటకూరను వేపుడుగా కాకుండా కూరగా చేసుకుంటేనే తోటకూరలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.