ఈ పొడిని వాడితే కొవ్వు కరుగుతుంది , లివర్ క్లీన్ అవుతుంది మరియు లివర్ సమస్యలు తగ్గుతాయి

కరివేపాకు అనేది ప్రతి ఒక్క వంటకంలో కచ్చితంగా వాడతాము, కరివేపాకు వంటలకు వాసనా మరియు రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక మరియు వైద్య సంబంధ విలువలను కూడా అందచేస్తుంది. కరివేపాకులో బీటాకెరోటిన్ ఉంటుంది, ఇది కంటి చూపుకు, జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కరివేపాకులో సుమారు 7500 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుంది.

విటమిన్ ఏ అనేది అన్నిటీన్లో కంటే ఎక్కువగా కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు పచ్చిగా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే కరివేపాకు ఆకులను ఎండబెట్టి పొడి చేసి వాడుకోవడం చాల మంచిది. ఈ పొడిలో ఉంటె ప్రాపర్టీస్ అనేవి బాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దాని వలన గుండె జబ్బులను రాకుండా అరికడుతుంది. అంతేకాకుండా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కరివేపాకు పొడి వాడటం వలన మెదడు, మెదడు నరాలను హాని చేసే ఎంజయ్మ్స్ నుండి కాపాడి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కరివేపాకు పొడిఅనేది కాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. కరివేపాకు పొడిని వెల్లుల్లి కారంతో పాటుగా రోజు టిఫిన్స్లో, అన్నంలో వాడుకోవచ్చు. కరివేపాకు పొడి అనేది జుట్టు పెరగడానికి, డయాబెటిస్ తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకు పొడి వాడటం వలన రక్త హీనత సమస్య మెరుగవుతుంది. గర్భిణీ మహిళలకు కరివేయకు ఎంతో ఉపయోగపడుతుంది.