సెంట్ కంటే మంచిగా పనిచేసే ఆకు.. ఒంటికి మంచి సువాసన!

ప్రకృతిలో మనకి లభించేవి ఆ దేవుడికే అర్పించడం మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. హిందూ సంపద్రాయంలో పళ్ళు, ఆకులు దేవుడ్ని పూజించడంలో ఉపయోగిస్తారు. ఒక్కో దేవుడికి ఒక్కో పత్రం ఇష్టం. దాని ప్రకారం ఆ దేవుడికి ఆ పత్రం సమర్పిస్తాం. వినాయకుడికి ఒక ఆకు ఇష్టం, విష్ణు మూర్తికి ఒక ఆకు ఇష్టం. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆకు గురించి మనం మాట్లాడుకుందాం.

మారేడు దళం ప్రత్యేకత:

మారేడు దళం శివుడికి ఎంతో ఇష్టం. శివ భక్తులు శివుడ్ని అదే ఆకుతో పూజిస్తారు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే మారేడు దళాలు దొరకడం కూడా కష్టమే. అలా ఉంటుంది పరిస్థితి. ఈ ఆకులతో పూజిస్తే శంకర భగవానుడు కోరిన కోరికలు తీరిస్తాడని నమ్మకం. మారేడు దళం ప్రత్యేకత ఏంటంటే, అది ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుంచి వచ్చే దుర్గంధం పోతుంది.అంతే కాదు ఒక మంచి సెంట్ లాగా మంచి గంధం కూడా వెదజల్లుతుంది. కొంతమందికి అధికంగా చెమట వస్తుంది. వాళ్ళు స్నానం చేసే నీళ్ళలో ఈ ఆకులను వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మారేడు దళంలో పోషకాలు పుష్కలం. కెరోటిన్,విటమిన్,పొటాషియం,ఫైబర్ వంటి ఖనిజాలు ఉంటాయి. మారేడు దళాల రసం ఆరోగ్యానికి మంచిది. వంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి.

ఈ ఆకులు తినడం వల్ల శరీరం లోని వ్యర్థాలు బయటకి వెళ్ళి ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు చెప్పేది ఏంటంటే మారేడు ఆకులు మాత్రమే కాదు, పళ్ళు కూడా మంచివే. పళ్లలో ఉండే లక్షణాలు గుండెకి, మెదడుకి మంచిది. ఏ కాలంలో అయినా ఈ పళ్ళు తినచ్చు. వేసవి కాలంలో వీటి ప్రభావం ఇంకా ఎక్కువ. వంటికి చలవ చేసి ఈ పళ్ళు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మారేడు పళ్ళతో చేసిన జ్యూస్ లు బాగా అమ్ముడవుతాయి. ఈ పళ్ళు జీర్ణక్రియకి కూడా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు నిపుణులు. మరి.. మారేడు దళం ప్రత్యేకతలు తెలిశాక.. కెమికల్స్ కలిసిన రసాయనాల కన్నా.. ఈ ఆకు చాలా బెటర్ అనిపిస్తుంది కదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.