ఉదయాన్నే ఇవి తింటే 40 కాదు 80 ఏళ్ళు వచ్చినా యంగ్ గా కనిపిస్తారు…!

మనం అంజీర ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది . మనం ఈ అంజీర ను పచ్చిగా గాని నీళ్లలో నానబెట్టి గాని తినవచ్చు. మనం పడుకునే ముందు ఒక కప్ లో కొన్నినీళ్లు పోసి అందులో నానబెట్టి పొద్దున్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి .వేసవి కాలం లో వీటిని నానబెట్టి తింటే చాల మంచిది . అదే మరి చలి కాలం , వర్షా కాలం లో అయితే డైరెక్టుగా కూడా తినవచ్చు కాకపోతే వీటిని నానబెట్టి తింటే మరీ మంచిది .

మానవ శరీరంలో ఎముకల ఆరోగ్య అనేది చాలా అవసరం. ఎముకులు దృడంగా లేకపోతే మనం కాస్త జారీ పడిపోయిన సరే ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది . ఎముకలు దృడంగా ఉండాలంటే వాటికీ కాల్షియం అనేది ఎంతో అవసరం . అంజీరలో వుండే సహజ సిద్దమైన కాల్షియం వల్ల ఎముకలతో పాటు దంతాలు కూడా మంచి బలంగా మారుతాయి .

గర్భిణీలకు కూడా అంజీరలు ఎంతో మేలు చేస్తాయి . అంజీర వుండే అధిక పోషకాల వల్ల డాక్టర్లు కూడా తినమని చెప్తారు . అంజీరలో వుండే విటమిన్ B అనేది గర్భిణీ స్త్రీలలో కలిగే ఉదయపు నీరసాన్ని తగ్గిస్తుంది .అంజీర పళ్లలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణం సరిగా అయి మల బద్దక సమస్యను కూడా తగ్గిస్తుంది .