ఉల్లి తొక్కలు పారేస్తున్నారా .ఒక్కసారి ఇది చూడండి .ఇంకెప్పుడు పారేయరు

ఉల్లి ఆరోగ్యాన్ని తల్లి వంటిది అని చెబుతూ వుంటారు . ఉల్లిని రకరకాల వంటల్లో రుచి మరియు గ్రేవీ కోసం వాడుతూ వుంటారు .అలాగే ఉల్లి తొక్కలను బయట పడేస్తూ వుంటారు . కానీ వీటిలో ఎన్ని ప్రయోజనాలు వున్నాయి . అందులో ఒకటి జుట్టురాలే సమస్యను నివారించడంలో ఉల్లి తొక్కలు చాల బాగా పనిచేస్తాయి . దానికోసం మనం ఉల్లి తొక్కలను సేకరించి పెట్టుకోవాలి . వాటిని ఒకసారి నీటిలో కడిగి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి అవి మునిగేవరకు నీరు వేసుకోవాలి . ఈ నీటిని బాగా మరిగించాలి .

నీరు బాగా మరిగి రంగు మరెంతవరకు అలానే ఉండనివ్వాలి ఆ తర్వాత దానిపై ఒక ముథ పెట్టి 5నిముషాల మరిగించాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వాడకట్టుకోవాలి . ఈ నీరు మంచి బ్రౌన్ కలర్ లోకి వస్తాయి .తర్వాత అన్నిటిని తలకి అప్లై చేయాలి లేదా జుట్టు కుదుళ్లకు చేతి వేళ్ళతో పట్టించి 10నిముషాలు మసాజ్ చేయాలి . ఇలా చేయడం వలన జుట్టు రాలె సమస్య తగ్గుతుంది .రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా ,దృడంగా మారుతుంది . ఉల్లిపాయలు సల్ఫర్ తో నిండి ఉంటాయి ఇవి జుట్టు సమర్థవంతంగా పెరగడానికి సహాయపడుతూ మరియు జుట్టు రాలడాన్ని ఆపుతాయి .ఇందులో వాడిన కరివేపాకు జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి జుట్టు నల్లగా ఉండేందుకు సహకరిస్తుంది .

Stop throwing onion peels, here's how you can use them effectively | The  Times of India

ఈ నీరు ఎండినట్టు వున్న జుట్టుకు జీవాన్ని ఇచ్చి తిరిగి మెరుస్తూ ఉండేలా చేస్తుంది . ఉల్లి నీటిని మీ జుట్టుకు వారానికి రెండు సార్లు తప్పకుండా ఉపయోగించండి ఇది మీ జుట్టు పెరుగుదలలో అద్భుతమైన మార్పును చూస్తారు .ఈ నీటిని గాజు సీసాలో పోసుకొని ఫ్రిజ్ లో వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు . ఎన్నో అధ్యయనాలు ఉల్లి పాయ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ,ఫైబర్ ,విటమిన్ ఏ ,సి ,ఇ మరియు గుండెకు అనుకూలమైన ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు . రోగనిరోధక శక్తిని పెంచాడనికి మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ,రక్తంలో చెక్కర స్థాయిని నిర్వర్తించడానికి ఉల్లిపాయ తొక్కలు ప్రయోజన కరంగా వుంటాయని చెప్పబడింది .