వజ్రం కంటే విలువైన మొక్క. ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి . వెంటనే ఇంటికి తెచ్చుకోండి .

రెడ్డి వారి నానుబాలు లేదా పచ్చబొట్టు మొక్క గురించి తెలుసా .ఈ పేరు ఎప్పుడైనా విన్నట్టుందా . చిన్నతనంలో ఈ చెట్టు పాలను చేతిపై అక్షరాలుగా రాసుకొని మట్టి వేస్తే అక్కడ అల్షరాలు కనిపించేవి . పల్లెల్లో ఇంటిముందు ,పొలాల్లో ,మట్టిగోడలపైన నిరుఎప్పుడు వుండే కాలువల చోట ,పొలం గట్లపై కనిపించే ఈ మొక్కను ఈ కలుపు మొక్కగా భావించి తీసేస్తూ ఉంటాం . కానీ ఈ మొక్క అనేక కంటి సమస్యలను తొలగించి దృష్టిని పెంచడంలోనూ ,శృంగార సామర్ధ్యాన్ని పెంచి సంతాన సామర్ధ్యాన్ని పెంచడంలోనూ ,స్త్రీ ,పురుషులకు యవ్వన శక్తిని ,శరీరంలో ఏర్పడే కణుతులను ,గడ్డలను కరిగించగల అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్నది . ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఈ మొక్కను సంస్కృతంలో దుత్తిక అని ఇక ఒక్కో ప్రదేశానికి ఒక్కో పేరుతో పిలుస్తారు . హిందీలో దూత్తి అని ,తెలుగులో పచ్చబొట్టు మొక్క , రెడ్డి వారి నానుబాలు ,పాలకాడ ,గొర్రెకాడా అని పిలుస్తారు .

https://youtu.be/bRcjB3fyV6M

ఈ మొక్క తెలుపు ,ఎరుపు వంటి రెండు రంగుల్లో పెరుగుతుంది . మట్టిలో ఉండే బలం వలన పెద్దగా అడుగువరకు పెరిగే పెద్ద రెడ్డివారినానుబాలు అంటారు కానీ చిన్నగా సన్నగా పెరిగే మొక్కల్లోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆకులను దంచి తీసిన రసంతో పూర్వకాలంలో సూదులతో పచ్చబొట్లు వేసేవారట . ఈ మొక్క రుచి తీపిగా ,కరం ,వగరుగా విచిత్రంగా ఉంటుంది . ఈ ఆకుల రసం లేదా కాషాయాన్ని మోతాదుకు తగినట్టు తీసుకుంటే శరీరంలో మధుమేహ రోగాలు ,పేగులలో పుట్టే పురుగులు ,బ్యాక్టీరియా సంబంధ రోగాలు ,గొంతుకు సంబందించిన రోగాలు ,కంటికి సంబందించిన సమస్యలు ,చర్మం పై వచ్చే సెగగడ్డలకు సంబందించిన రోగాలను సమూలంగా నయం చేస్తుంది .

ఈ ఆకులను పప్పులో వేసి కూరల చేసుకుని తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది . ఈ మొక్కను తెచ్చి బాగా ఎండబెట్టి మిక్సీ పట్టి పొడి చేసుకొని ఈ పొడిని జల్లించి గాజు సీసాలో నిల్వ చేయాలి . రోజు భోజనానికి అరగంట ముందు అరగ్లాసు వేడినీటిలో ఈ పొడి ఒక స్పూన్ కలిపి తీసుకోవాలి . దీని వలన మధుమేహం అదుపులోకి వస్తుంది .కంటిచూపు మెరుగవుతుంది .వీర్య లోపాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది .శరీరంలో కంతులు లేదా గడ్డలు ఏర్పడినప్పుడు ఈ చెట్టు పాలను తీసుకొని గడ్డలు వున్నా చోట మసాజ్ చేస్తే అక్కడ కణుతులు తగ్గిపోతాయి .