ఊపిరితిత్తుల్లో పేర్కొన్న కఫము ఒక్క ట్రిప్పులో బయటికి వస్తుంది…

పంచదార వాడకం కంటే, బెల్లం వాడకం మంచిది అని తెలిసి, సకాలంలో అందరూ పంచదార వాడకం తగ్గించి, బెల్లం వాడకాన్ని పెంచుకుంటూ ఉన్నారు, ఈ బెల్లం లో కూడా ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిది అని దీనికి ఎక్కువ ఇష్టపడి కొంతమంది, ఏ మందులు ,కెమికల్స్ కలపకుండా తయారుచేసిన ప్యూర్ ఆర్గానిక్ బెల్లం, ప్యూర్ చెరుకు నుండి తీసిన బెల్లం అని మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు.ఇంకా కొంతమంది చెరుకు తో తయారుచేసిన బెల్లం కంటే, తాటి బెల్లం ఇంకా మంచిదని, అంటే బ్యాక్ టు నేచర్ అన్నట్టు, మళ్లీ 50 70 ఏళ్ల క్రితం ఉన్న తాటి బెల్లం మళ్లీ ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అందుకని రోడ్ల పక్కన బుట్టలో పెట్టుకుని తాటి బెల్లం అని అమ్ముతూ ఉంటారు. పంచదారతో పోలిస్తే, బెల్లం, ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం ఇవన్ని మంచిదే. కానీ ఏ బెల్లాలు అయినా తయారైనప్పుడు, ఐదు లేదా ఆరు గంటలు మరిగితే తప్ప అది గడ్డకట్టదు.మరి అన్ని గంటల వరకు వండితే, ఆ వేడికి అందులో ఉండే మంచి పోషకాలు కూడా పోతాయి, హాని కలిగించే ఫ్రీరాడికల్స్ కొన్ని ఫామ్ అవుతాయి, అందుకని మీరు పంచదార తినకుండా, ఆర్గానిక్ బెల్లం తిన్న, తాటి బెల్లం తిన్న, మామూలు బెల్లం తిన్న, పళ్ళు పుచ్చు తాయి.

దీనివల్ల బ్యాక్టీరియా నోటిలో పెరిగి ,పళ్ళు గార పడుతాయి, చిగుళ్ళు కదులుతాయి, త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి, కపం పెరగడం , శ్లేష్మం రావడం ఇవన్నీ కూడా బెల్లం తినడం వలన జరుగుతూ ఉంటాయి. కాకపోతే పంచదార అంత స్పీడ్ గా పెరగవు, కాకపోతే దీనికి కూడా నష్టం ఉంది. బెల్లం, ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం వీటన్నిటి కంటే కూడా, తీపి నిచ్చే మరొక పాకము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం! బెల్లం తయారవడానికి ముందు కనుక దానిని తీసుకువస్తే, దాన్ని చెరుకు పానకం అంటారు. ఇది ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది.ఈ చెరుకు పానకం మీ ఇంట్లో ఉంచుకుంటే ,ఎప్పటికీ ఈ తీపి తయారుచేసుకోవాలి అన్నా దీనిని వేసి చేసుకోవచ్చు. పాయసం, స్వీట్స్ అన్నిటికీ దీన్నే వాడుకోవచ్చు, దీనిని మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చుఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ లాంటి చెరుకు తయారుచేసే ప్రాంతాలలో చెరుకు పానకం అనేది దొరుకుతుంది. వాళ్లు బెల్లం గడ్డ కట్టక ముందే చెరుకు రసాన్ని బాండీలో పోసి మరిగించి, 50% వరకు మరిగాక, దాన్ని బాటిల్స్ లో పోసే అమ్ముతారు. దీనినే చెరుకు పానకం అంటారు.

ఈ చెరుకు పానకం అనేది బెల్లం లో పోషకాల నష్టం అనేది వస్తుంది కానీ, ఈ చెరుకు పానకం లో పెద్దగా రాదు ఎందుకంటే 50% వరకే మరుగుతుంది కాబట్టి, చెరుకు రసం ఒక లీటర్ తీసుకువచ్చి, ఒక 600ml అయ్యే వరకు మరిగించండి. లీటర్ నుండి ఒక 400ml వరకు నీరు తగ్గిపోతుంది లేదా 500ml తగ్గిపోతుంది. ఇలా తయారు చేసింది కొంచెం చిక్కగా ఉంటుంది, దీనిని ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్లో పెట్టుకోండి, దీన్ని మీరు స్వీట్స్ లాంటి తయారీలలో వాడుకోండి, దీనివలన కపము, శ్లేష్మము అనేవి తగ్గుతాయి.ఎందుకంటే దీనిని 4 లేదా5 గంటలు బెల్లం లాగా వంట లేదు కదా, అందువలన కలర్లో ఎటువంటి సమస్య ఉండదు. అందుకని చెరుకు శాతంలో కొద్దిగా నీటి శాతాన్ని తగ్గించాము, ఒక లీటరు చెరుకు రసం పెడితే ,మామూలుగా పావు గంట వరకు చెరుకు పానకం అనేది వచ్చేస్తుంది. ఇది ఎక్కువ వేడికి గురి కావట్లేదు కాబట్టి పోషకాలు అనేది ఎక్కువగా పోవడం లేదు, చెరుకు పానకాన్ని ఇంట్లో కనుక ఉంచుకున్న అట్లయితే, ఎప్పుడైనా నీ పిల్లలకు ఇడ్లీ తినేటప్పుడు పంచదార వేస్తుంటారు, దోషలకి పంచదార వేస్తుంటారు, లేకుండా చెరుకు పానకం పెట్టి, తినమని చెప్పండి.

అలాగే పూరి ఇలాంటివి తినేటప్పుడు కూడా పంచదార వేసుకుని తింటుంటారు ఇలా చేయవద్దు, ఇలా కాకుండా చెరుకు పానకం తో పూరి తినండి, బ్రెడ్ పైన జామ్ రాస్తుంటారు ఇక నుంచి అలా చేయకండి చక్కగా చెరుకు పానకం పెట్టుకొని తినండి. అంతేకాకుండా చెరుకు పానకం తో పాకం గారెలు వేసుకోవచ్చు, వీటన్నిటికీ బెల్లం టేస్ట్ వస్తుంది కాకపోతే పోషకాలను నష్టపోము.అంతే కాకుండా పాయసం కాచుకునే టప్పుడు, కొన్ని రకాల స్వీట్లు తయారు చేసుకునే టప్పుడు దీన్ని ఉపయోగించుకోండి. అలాగే ఆస్తమా లాంటి ఉన్నవారు, అలర్జీ, తుమ్ములు, దగ్గులు, కఫాలు పట్టేవారు, అన్నిటికి పంచదార మరియు బెల్లం కరెక్ట్ కాదు. ఎండు ఖర్జూరాలు చాలా మంచిది, ఇది చాలా బెస్ట్ , అలా వద్దు అనుకునేవాళ్ళు, ఇలా చెరుకు పానకం తో వాడండి.తేనే వేసిన దానికంటే కూడా చెరుకు పానకం వేసి స్వీట్లు తయారు చేస్తే, టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, అంటే దీనిలో సాల్ట్ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాస్త మరిగే సరికి, టేస్ట్ అనేది స్పెషల్ గా వస్తుంది, అందుకని మీరు అన్నిట్లో కూడా నాచురల్ ఫాలోవర్స్ అందరూ కూడా ఒక ఐదారు లీటర్ల చెరకు రసాన్ని కొనుక్కొని, దాని క్వాంటిటీ 50% వరకు అయ్యేవరకు మరిగించి, దానిని సీసాలో పోసుకుని భద్రపరుచుకోండి. చక్కగా పిల్లలు పెద్దలు అన్నిట్లోనూ వాడుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది.