ఒకప్పటి స్టార్ హీరోయిన్ కమలినీ ముఖర్జీ.. ఏంటీ ఇలా మారిపోయింది…?

తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన నాటి నుండి అనేక మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. వారిలో కొంత మంది మాత్రమే మనస్సును హత్తుకునే పాత్రలు చేస్తుంటారు. కట్టు..బొట్టు.. తమ నటనతో.. అరే ఆ అమ్మాయి మన పక్కంట్లో, ఎదురింట్లో ఉన్నట్లే ఉందిరా అన్న ఫీలింగ్ తెస్తారు.

స్టార్ హోదాను అనుభవించి అంతలోనే కనుమరుగై పోతారు. అటువంటి వారిలో ఆమె కూడా ఒకరు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదూ.. కమలినీ ముఖర్జీ. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యారు.

అందులో ఆమె నటనను చూసి మనింట్లో అమ్మాయే అనుకున్నారంతా. మీనాక్షి, గోదావరి, గమ్యం, క్లాస్ మేట్స్, హ్యపీ డేస్, జల్సా, గోపి.. గోపిక.. గోదావరి.., రామాచారి వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో చివరిగా రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలేలో కనిపించారు.

2016లో మలయాళంలో చివరిగా నటించారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిర పడిందని వినికిడి. ఆమె వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డల్లాస్ లో జరిగిన ఓ వేడుకల్లో ఆమె కనిపించారు. కాస్త బొద్దుగా మారిపోయారు.

బ్లూ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మన కమలినీయేనా అని.. ఇలా మారిపోయిందేండబ్బా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.