కంటి కింద నలుపు పూర్తిగా పోగొట్టే అద్భుతమైన ఈసీ చిట్కా …ఈ పండు రసం రాస్తే చాలు…

కళ్ళ కింద మచ్చలు, ముడతలు, కళ్ళ కింద నల్ల గా పేరుకుపోయి గుంతల లాగా ఏర్పడతాయి. వీటి నివారణ కోసం ఏం చేయాలి అంటే కంటి మీద , కంటిపై ఉండే స్కిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఇది చిన్న పిల్లలలో కనిపించదు, ఒకవేళ చిన్న పిల్లలలో కంటి కింద నల్ల చారలు ఉన్నట్లయితే పిల్లల పొట్టలో పాములు ఉన్నాయేమో ఒకసారి చూపించండి.లేదా ఎనీమియా ఉన్నా చిన్నపిల్లల్లో కంటి కింద నల్లటి చారలు కనిపిస్తాయి. డాక్టర్ కి చూపించినపుడు మీరు ఈ విషయం గురించి డాక్టర్ తో కచ్చితంగా చెప్పండి. పౌష్టికాహారం లోపం వల్ల కూడా కళ్ల కింద నల్లచారలు వస్తాయి. పీరియడ్స్ వచ్చాక పిల్లలకి ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ లో హెచ్చుతగ్గులు, స్కూల్స్లో ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, ఎప్పుడు సెల్ఫోన్ చూస్తూ ఉండడం, వీటివల్ల కూడా కంటి కింద నల్ల చారలు వస్తాయి.స్క్రీన్ టైం ఎం అంటే ఎక్కువగా ఫోన్ , కంప్యూటర్స్, టీవీ మొదలైన వాటికి దూరంగా ఉండండి.

పీరియడ్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి కోసం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. టీనేజ్ పిల్లల్లో ఇలాంటి జాగ్రత్తలను తీసుకోండి. ఆ తర్వాత 23-24 మధ్య వయసు వారికి కంటి కింద నల్ల చారలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్లంతా 24గంటలు స్క్రీన్ ,ఆఫీస్లో ఒత్తిడి, పెళ్లిలో ఒత్తిడి, వ్యక్తిగత ఇబ్బందులు కూడా ఒక కారణం అవుతాయి.వయసు పెరగడంతో పాటు అనారోగ్య కారణాల వల్ల కూడా కంటి కింద నల్ల చారలు వస్తూ ఉంటాయి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, విపరీతంగా అలసిపోవడం, అలసటకు తగినంత విశ్రాంతి లేకపోవడం, ఆహారంలో హెచ్చుతగ్గులు సరిగా తినకపోవడం, ఎనీమియా ,థైరాయిడ్, బిపి ఇవన్నీ కూడా కంటి కింద నల్ల చారలు కి కళ్ళ కింద గుంతలు ఏర్పడడానికి కారణమవుతాయి.

ప్రెగ్నెన్సీ లో ప్రతి నెలలో కంటి కింద గుంతలు ఏర్పడతాయి ఆ తర్వాత మెల్లిగా సర్దుకుంటాయి. వీటిని తగ్గించడానికి ఏం చేయాలి అంటే, మొదటగా నిద్ర సరిగ్గా పోవాలి, తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవాలి,మంచి సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి, ఏదైనా ఫ్రూట్ తిన్నప్పుడు ఆ ఫ్రూట్ తో కాస్త కంటిపైన కింద అప్లై చేస్తూ ఉండాలి. బాదం నూనెతో కంటిచుట్టూ ఉంగరం వేలితోమెల్లగా మర్దన చేసుకోండి. ఆవు నెయ్యితో, ఆవు పాల మీద మీగడ తో కూడా సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్ళు కాస్త రిలీఫ్ అవుతాయి, కంటి చుట్టూ ఉండే నల్ల చారలు మెల్లగా తగ్గుతాయి. మధ్యాహ్నం పూట లైటింగ్ ఉన్నచోట వీలైనంత సేపు కళ్ళు మూసుకొని ఉండండి, ఇలా 5 నిముషాలకి ఒకసారి తెరుస్తూ మూస్తూ ఉండండి, ఇలా ఒక ఐదు సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల కంటి నరాల కి విశ్రాంతి దొరుకుతుంది.