వేడెక్కిన బాడీని చల్లబరిచే అద్భుతమైన డ్రింక్ ఒంట్లో వేడిని అమాంతం తగ్గిస్తుంది

ఏప్రిల్ నెల వచ్చింది అంటే ఎండల తీవ్రత బాగా పెరుగుతుంది ఇక మే నెల రోహిణి కార్తె అయితే చెప్పనవసరం లేదు . ఈ ఎండా కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి . మన శరీర వేడి తాపాన్ని తగ్గించే కూలెంట్ ఉపయోగపడే నాచురల్ కూలెంట్ ఎడిబుల్ గమ్. దీన్ని కఠోర అని అంటారు.. ఇది ప్రగకాంత చెట్టు నుండి ఊట లాగా కారుతుంది.

తుమ్మ చెట్టు బంక మాదిరిలాగా కారి గట్టిపడి నిల్వ ఉంటుంది. ఈ గట్టిపడిన బంకనే కఠోర ఎడిబుల్ గమ్ అంటారు.దీనిని బాదం బంక అని కూడా అంటారు . ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది . ఎండా కాలంలో బాదం బంక ను తాగటం వల్ల వడదెబ్బ నుండి రక్షిస్తుంది . ఇది రక్తపోటును కూడ తగ్గిస్తుంది . బాదం బంక ను తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడ మెరుగుపడుతుంది .

చర్మం పైన ఒక ప్యాక్ లాగ వేసుకుంటే చర్మం పై ముడతలు , గీతాలు పోయేలా చేస్తుంది .బాదం బంక అనేక పోషక లక్షణాలు కలిగి ఉంటుంది . గర్భం తో ఉన్న స్త్రీలు ఇవి ఇవి తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది . బాదం బంక తో చేసిన స్వీట్లు తినడం వల్ల తల్లి , బిడ్డకు మంచి పోషక విలువలు అందుతాయి.