కార్పొరేట్ జాబ్‌ను వ‌దిలి .. ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు…

వ్యవసాయం ఈ మాటల్లోనే ఉంది సాయం, దేశం ఎంత అభివృద్ధి చెందిన ఆర్థిక రంగం ఎంత దూసుకుపోతున్న, కచ్చితంగా మనం అన్నం తినాల్సిందే, భోజనానికి ఏదో ఒక ఆహారం ఉండాల్సిందే, ఆహారం ఉండాలి అన్న రైతన్న ఉండాల్సిందే కష్టపడి పనిచేసే రైతన్న మనకి మూడు పూటలా తినడానికి ఆహారధాన్యాలను పండిస్తున్నారు. ఎంతో కార్పొరేట్ కల్చర్ లో జాబ్ చేస్తున్న చాలామంది ఇప్పుడు ఆ కార్పొరేట్ జాబ్ లను పక్కనపెట్టి పంట కల్ల లలోకి వస్తున్నారు, ఇలా చాలా మంది ఇంజనీర్లు మెడిసిన్ చదివి నటువంటి వైద్యులు, లాయర్లు పెద్దపెద్ద కొలువులను పక్కన పెట్టి కష్టపడి రైతుల మారి కార్పొరేట్ సైతం కాదని ఇప్పుడు వ్యవసాయంలోకి దిగుతున్నారు. లక్షల రూపాయలు జీతాలను వదిలిన ఇంజనీర్లు ఐదారు ఎకరాల పొలాన్ని తీసుకొని, అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, అద్భుతమైనటువంటి రాబడి వస్తుంది. అయితే కష్టపడి పని చేస్తూ సరైన పద్ధతిలో మెళకువలను పాటిస్తూ ఉంటే, కచ్చితంగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేయవచ్చు నిరూపిస్తున్నారు ఒక వ్యక్తి .

https://youtu.be/n8k8d0py1Dc

ఒక కార్పొరేట్ జాబ్ కన్నా వ్యవసాయమే మేలు అని భావించాడు, అతడు జాబ్ ని వదిలేసి మంచి మెలకువలతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టి అంజీర్ పనులను పండిస్తూ, ఏడాదికి కోటిన్నర వరకు సంపాదిస్తున్నాడు.అతడిది మహారాష్ట్రలోని పూనే కి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న dawnd అనే గ్రామం,ఈ గ్రామానికి చెందిన సమీర్ దంబే 2013 వరకు కార్పొరేట్ కంపెనీలో నెలకు 50 వేల జీతం ఉద్యోగం చేశాడు, కానీ అతనికి తృప్తి లేదు, జాబ్ మానేసి తన గ్రామానికి వచ్చి తనకు ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో, అంజీర్ పండ్లను పండించడం మొదలుపెట్టాడు.అంజీర పండ్ల ద్వారా లాభాలను గడించాడు తన గ్రామానికి నీరు కూడా సరిగ్గా ఉండదు, వర్షం మీద పంటలు ఆధారపడతాయి.కానీ గ్రామం చుట్టూ చిన్న చిన్న కొండలు ఉన్నాయి, వాటిని ఆనుకుని వారి భూమి ఉంది, అంజీర పండ్లు పండ్లు పండెన్దుకు ఈ వాతావరణం సరిగా సరిపోతుంది. దీన్ని పసిగట్టాడు, వెంటనే పండ్లను పండించడం మొదలుపెట్టాడు, తక్కువ కాలంలోనే వృద్ధి లోకి వచ్చాడు తన పంటను సాధారణ మార్కెట్లోకి తరలించ లేదు, తక్కువ ధర వస్తుందని తాను చిన్న చిన్న ప్యాకెట్ లో పెట్టి సూపర్ మార్కెట్ కి సరఫరా చేయడం మొదలు పెట్టాడు. అది కలిసి వచ్చింది.

అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు.లక్షలలో ఉండే ఆదాయం కోట్లకు చేరింది, అతని నుండి వచ్చే పండ్ల కోసం చాలా సూపర్ మార్కెట్లో వెయిట్ చేస్తున్నాయి, కార్లు అదేవిధంగా బాండ్ల రూపంలో వచ్చి తీసుకు వెళుతున్నారు నేరుగా పంట దగ్గరకు వచ్చి. ఇక సూపర్ మార్కెట్ కి వచ్చే ప్యాకెట్ల మీద తన కంపెనీ పేరు, చిరునామా ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అందువల్ల వినియోగదారులే స్వయం గా అతని దగ్గరికి వస్తున్నారు. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే బుట్టలతో సహా తీసుకువెళ్తున్నారు.కరోనా సమయంలో కూడా మంచి లాభాలు వచ్చాయి, దాదాపు నెలకు 13 లక్షల వరకు సంపాదించాడు, ఈ కరోనా సమయంలో ప్రస్తుతం ఈ ఏడాదిలో కోటిన్నర వరకు ఆదాయం వస్తుంది. ఇక రెండున్నర ఎకరాలకు అదనంగా మరో రెండున్నర ఎకరాలు తీసుకొని అంజీర్ పండ్లను పండిస్తున్నాడు.

అంతే కాదు తోట దగ్గర పెట్టి పండ్లతో జామ్ తయారు చేస్తున్నాడు. ఇలాంటివి తయారుచేయడం వల్ల దీనికి మరింత ఆదరణ వచ్చింది. చిన్న పిల్లలు కూడా వీటిని బాగా తినడం మొదలు పెట్టారు, వీలైనంత వరకు మంచి మార్కెటింగ్ చేసుకున్నాడు, సక్సెస్ ఫుల్ గా తన బిజినెస్నీ రన్ చేస్తున్నాడు. ఐదు ఎకరాల పొలంలో ఆంజీర్ ను టన్నుల కొద్ది పండిస్తున్నాడు, సాధారణంగా అంజీర్ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ కేజీ 80 నుండి 120 వరకు ఉంటుంది. అంటే అలాగే ఆ పండ్లను పండించే లాభాలను గడిస్తున్న ఈ రైతుని అందరూ అప్రిషెట్ చేస్తున్నారు. దాదాపు అతను జామ్ ద్వారా మిగిలిన వాటి ద్వారా ఈ పండ్లు ఉత్పత్తి చేస్తూ దాదాపు 150 మందికి ఉద్యోగాన్ని కల్పించాడు. నిజంగా అతని ది రియల్ ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పాలి. ఏదైనా సరే కొత్త ఆలోచనా విధానం ఉండాలే గాని మార్గాలు ఎన్నో ఉంటాయి ఈ ప్రపంచంలో.