సుమ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే బిత్తరపోతారు….

తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ సుమ అంటే ఒక సంచలనం. బుల్లి తెరపై తిరుగులేని మహారాణిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆమె పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు ఆమె నోటి నుండి వచ్చే స్పష్టమైన తెలుగు వినపడుతుంది, ఎలాంటి షోలో అయినా ఉత్సాహంగా ఆమె పాల్గొనే విధానం ఆమె టైమింగ్ అన్ని కూడా నచ్చుతాయి. మాతృభాష కేరళ కానీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా చమత్కారంగా మాట్లాడడం ఆమెకు మాత్రమే సాధ్యం, యాంకరింగ్ రంగంలో తన స్థానాన్ని చేరుకోవడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పాలి. ఎంతమంది కుర్ర యాంకర్లు వస్తున్నా సరే సుమ డిమాండ్ పెరగడమే కానీ, తగ్గడం లేదు సుమ కనకాల యాంకర్ గా నాటిక 20 ఏళ్లుగా మన ఇంటి ఆడపడుచు మనతోనే మన అందరి తోనే ఉన్నారు. వినోద రంగంలో ఎంతో మంది యాంకర్లు వస్తున్న, మకుటంలేని మహారాణిగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు సుమ.

ఆమె మాటల ప్రవాహం లోనే కాదు చేతల్లో కూడా దిట్ట అనే చెప్పాలి, యాంకర్ అంటే సుమ అనేంతగా టాలీవుడ్లో చెరగని ముద్ర వేసింది. మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం. సుమ కనకాల మార్చి, 22 ,1974 లోని కేరళలోని పాలక్కాడ్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు పిఎన్ కుట్టి తల్లి పి విమల వీరిది కేరళ .సుమ తండ్రి ఉద్యోగి తల్లి విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్ లోనే ఉంటున్నారు కుటుంబం. ఆంధ్రాలో చిన్నతనం నుండి ఉండడంతో ఆమె తెలుగు బాగా మాట్లాడుతున్నారు, సికింద్రాబాద్ తార్నాకలోని కాలేజీలో ఇంటర్ చదివారు మొదట బైపిసి తీసుకుని, తర్వాత ఆర్ట్స్ గ్రూప్ లోకి మారారు, ఇంటర్ పూర్తయిన తర్వాత రైల్వే డిగ్రీ కళాశాలలో బీకాం లో చేరారు, తర్వాత కరస్పాండెంట్ కూడా పూర్తి చేశారు సుమ. చదువుకునే సమయంలో కూడా ఆమె తెలుగు సబ్జెక్ట్ ని ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగానే ఉందని అనేక సార్లు చెప్పారు. సుమా చిన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నారు, సికింద్రాబాద్లోని ఆనంద శంకర్ అనే గురువు దగ్గర భరతనాట్యం, భద్ర అనే గురువు దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు.

ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, ఒక సారి రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో సుమ డాన్స్ ప్రదర్శన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, ఆమెను దూరదర్శన్ సీరియల్ పెళ్లిచూపులు సీరియల్లో నటించాలని కోరారు, అప్పుడు సరిగ్గా సుమ వయసు 16 సంవత్సరాలు, అలా ఆమె నటన కెరియర్ మొదలయ్యింది, బుల్లితెర లోనే కాకుండా వెండితెర లో కూడా కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక్కటూ వంశీ హీరోగా నటించారు. 1994లో ఓ సీరియల్ షూటింగ్ లో తొలిసారి రాజీవ్ సుమ ని చూశారు ప్రపోజ్ కూడా చేశారు, అప్పటికే రాజీవ్ వాళ్ళ నాన్న దేవదాస్ కనకాలకు ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పేరు ఉంది. సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా తీస్తున్నారు, 1995 తర్వాత సీరియల్స్ కూడా సుమకు పెరిగాయి, తన సొంత ప్రొడక్షన్ లో మేఘమాల సీరియల్ లో నటించారు సుమ.

అప్పుడే రాజు పెళ్లి ప్రస్తావన వచ్చింది ఇలా రాజీవ్ కూడా నచ్చడంతో ఇద్దరు పెద్దల సమక్షంలో 1999లో వివాహం చేసుకున్నారు. తరువాత సుమ సీరియల్ , సినిమాలకి దూరంగా ఉండి ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు వందలాది సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తున్నారు సుమ. యాంకర్ అంటే సుమ అనేలా తనదైన మార్కు ఏర్పర్చుకున్నారు ఆమె, ఆమె మరిన్ని మంచి ప్రోగ్రామ్ షో లో చేయాలని మరిన్ని సినిమా ఈవెంట్ లతో అలరించాలని సినిమాల్లో కూడా అద్భుతమైన రోల్స్ చేయాలని మనం కూడా కోరుకుందాం.