కొబ్బరి నీళ్లలో ఇది కలిపి తాగితే కిడ్నీలో రాళ్ళూ కరిగిపోతాయి

ఈ రోజులలో చాలామంది కిడ్నీ సమస్యలతో ఎక్కువగా కిడ్నీ లో స్టోన్ రావడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఇలా స్టోన్ వచ్చిన వారిలో మూత్రం సాఫీగా రాదు, పొత్తికడుపు క్రింది భాగంలో చాలా విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది.ఈ నొప్పికి ఆధునిక పద్ధతిలో ఆపరేషన్ లాంటివి చేసి రాళ్ళను తీసేస్తున్నారు, అలా చేసినా కూడా మళ్ళీ తిరిగి రావడం ,మళ్లీ ఈ సమస్య బాధించడం వేలకు వేలు తీసుకువెళ్లి ఆస్పత్రిలో ఖర్చుపెట్టిన ఫలితం లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.కొంతమందికి ఖర్చు పెట్టాలన్న వాళ్ళ ఆర్ధిక స్తోమత సరిగ్గా లేక ఇబ్బంది పడే వాళ్ళ కోసం చక్కని వైద్యాన్ని తెలుసుకుందాం!

ముందుగా మనకు కావాల్సింది రణపాల ఆకు, రణపాల ఆకును తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి , రోట్లో వేసి మూడు మిరియాలు, మూడు వెల్లుల్లిపాయలు వేసి చక్కగా మెత్తగా నూరుకోవాలి ఆ రసాన్ని పిండుకుని ఒక యాభై ml వరకు ఉదయం సేవించిన ట్లయితే, దీనిని పరగడుపున రోజు ఏమి తిరగకుండానే సేవించాలి, ప్రతిరోజు సేవించినట్లు అయితే కొంతకాలానికి కనీసం 15 నుండి 25 రోజుల లోపు కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది.కొంతమందికి కొండపిండి ఆకు, ఈ ఆకు రాళ్లను అయినా కరిగిస్తుందని అంటారు, దాన్ని చెట్టు వేర్లతో సహా తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి, ఒక పాత్రలో వేసి, ఒక లీటరు నీళ్లు పోసి, అవి పావు లీటర్ అయ్యేవరకు మరిగించి చక్కగా వడపోసుకొని దాంట్లో మీకు కావాలంటే పటిక బెల్లము, పంచదార వేసుకుని చక్కగా సేవిస్తూ వచ్చినట్లయితే, ఇది కూడా ఉదయము పరిగడుపున నే సేవించాలి. ఇలా కొంతకాలము సేవిస్తూ వచ్చినట్లయితే, కిడ్నీ లో ఉండే స్టోన్ అనేది పూర్తిగా కరిగి పోవడం జరుగుతుంది.

ఇలా కాకుండా కొంతమంది పల్లెటూర్లలో ఉండే వాళ్లకి అరటి చెట్టు యొక్క లోపల ఉండే ట్యూబ్ లాంటి భాగాన్ని తీసుకుని, దీన్ని తాలింపు రూపంలో చేసుకొని మన పూర్వీకులు తినేవారు, ఇలా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని, కిడ్నీ సమస్యలు రావు అని ఇలా తీసుకుంటూ ఉండేవారు.ఈ కాలంలో ఇవన్నీ మర్చిపోయారు, పూర్వపు పద్ధతులు చాలా ఆరోగ్యకరం గా ఉండేవి. ఇలా అరటి చెట్టులోపల ఉండే భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, మెత్తగా నూరుకొని, రసాన్ని తీసుకుని, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.దీంతోపాటు పల్లేరు కాయ ఇది తీగతో ఉండి, పసుపు పూల తో ఉంటుంది. ఈ మొక్కను తెచ్చుకొని, కచ్చాపచ్చాగా దంచుకోవాలి, కొన్ని నీళ్లు పోసి, దీన్ని కూడా కాషాయం లాగా చేసుకుని, ఉదయము ప్రతిరోజు తప్పనిసరిగా సేవిస్తూ వస్తే ఎంతో దీర్ఘకాలికంగా బాధ పడుతున్న టువంటి ఈ కిడ్నీ స్టోన్ శాశ్వతంగా నివారించబడుతుంది.