గుడ్ న్యూస్ .. 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

Central Government Job : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ISRO నిరుద్యోగ అభ్యర్థులకు 2024 సంవత్సరానికి ఉద్యోగాలు విడుదల చేసింది. దీనిలో 224 పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

ఈ ISRO URSC నోటిఫికేషన్ 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Indian Space Research Organization (ISRO) నుండి టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి భర్తీ అయ్యాయి. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 224 టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. ఇక ఈ సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేయబోతున్న ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు వయసు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎస్సి, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు పదలింపు వర్తిస్తుంది.

ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయాలంటే 10th/ 10+2 పాస్ అయి ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి ఉద్యోగంలో చేరగానే 40వేల వరకు జీతం ప్రతినెలా వస్తుంది. ఇక ఈ జాబులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు ఫిబ్రవరి 10 నుండి చివరి తేదీ మార్చి 1 వరకు అప్లై చేయవచ్చు. తగిన విద్యార్హతలు ఉన్న వారిని ఈ సంస్థ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఇస్రో సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ ఫుల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు.