గ్రహణం వేళ వద్దు వద్దు అని మొత్తుకున్నా..చిన్న పిల్లాడిని బయటికి తీసుకొచ్చింది.. ఏమి జరిగింది

సాధారణంగా గ్రహానాల కాలంలో ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసి తిరిగి తెరుస్తారు. గ్రహణ సమయంలో చెడు ప్రభావం ఎక్కువ గా ఉంటుందని, కొంతమంది చెబుతారు. రాహు కేతు గ్రహాలు దేవతలను మింగేసే ముప్పు ఉందని అంటూ ఉంటారు. గ్రహణ సమయాల్లో రాహు కేతును శాంతి పరిస్తే మంచి జరుగుతుందని, మూఢవిశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో గ్రహణాల సమయంలో కొంతమంది మూర్ఖంగా ఆలోచించి, నరభలులు చేస్తూ ఉంటారు. లోకానికి వెలుగునిచ్చే సూర్యున్ని రాహువు మింగేస్తాడని, అందువల్లే సూర్యగ్రహణం ఏర్పడుతుందని కొందరి నమ్మకం, గ్రహణ సమయాల్లో కీడు ఎక్కువగా ఉంటుందని, తినకూడదని చెబుతారు. గర్భిణీలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు.

సాధారణంగా సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేఖ మీదికి వచ్చినప్పుడు, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సైన్స్ కానీ ముఖ్యంగా ముహూర్తంగా ఆలోచించేవారు, ఇవేమీ పట్టించుకోరు. గ్రహణ సమయాల్లో క్షుద్ర పూజలు చేస్తే బలిస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారు. చిన్న పిల్లలను అమాయకంగా కనిపించే యువతి యువకులను కిడ్నాప్ చేసి బలిస్తారు. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కే పి హెచ్ పి సమీపంలోని హైదర్ నగర్ లోని నర బలి కలకలం రేపుతుంది. స్మశానంలో క్షుద్ర పూజలు చేసి, నరబలే చేశారని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది దుండగులు ఒక యువకుడిని చంపి తగలబెట్టారు. మంగళవారం అమావాస్య అందులోనే సూర్యగ్రహణం నేపథ్యంలో, యువకుడిని బలి యిచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అసలు నిజాలు పేలుతాయే కొన్నేళ్ల కిందట హైదరాబాదులో చంద్రగ్రహణం సమయంలో ఒక చిన్నారిని బలిచ్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో చిన్నారులను కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. 24 గంటలపాటు పిల్లలని ఒంటరిగా వదిలేయకుండా వారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. ముక్కు ముఖం తెలియని వారు చెప్పే మాట మాయమాటలు నమ్మవద్దని, వారు ఇచ్చే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని వెంట వెళ్ళొద్దని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. సమాజంలో క్రైమ్ ఘటనలను గమనిస్తే తెలియని వారితో కంటే తెలిసిన వారితోనే ఎక్కువ ముప్పు జరుగుతుంది. ఎవరి విశ్వాసాలు ఎలా ఉన్న మూర్ఖంగా ఆలోచించేవాడు మనసులో ఏముందో పసిగట్టలేము కాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉండడం అన్నివేళలా శ్రేయస్కరం.