మథురలో బయటపడ్డ 470 ఏళ్ల నాటి ఆలయం చూసి ఊరు ఊరంతా షాక్ అయ్యారు.

తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా మెయిన్‌పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా – ఏఎస్ఐ సమాచారాన్ని అందించింది. అయితే గతంలో అక్కడ శ్రీ కృష్ణుడి ఆలయం ఉండేదని.. అయితే దాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కూల్చేసి.. ఆ స్థానంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించినట్లు తెలిపింది. అయితే ఈ వివరాలను మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌కు సంబంధించి 1920 గెజిట్‌లోని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడించినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అయితే అయోధ్య, మథుర ,

కాశీ లలోని వివాదాస్పద ప్రదేశాలను హిందువులకు అప్పగించాలని 1991లోనే తాను పార్లమెంటులో ప్రతిపాదించానని రామ మందిర ఉద్యమంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన ఉమాభారతి చెప్పారు. జ్ఞానవాపి వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఉమా భారతి.. 1993లో జ్ఞానవాపి గోడలపై చెక్కి ఉన్న విగ్రహాలను తాను పూజించి విషయాన్ని గుర్తు చేశారు. కాశి, మథుర ఆలయాల విషయంలో ముస్లింలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారికి కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఉమా భారతి వ్యాఖ్యానించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అంతా పాటిస్తామని చెప్పారు.

‘‘వారణాసి జిల్లా కోర్టు తీర్పు తరువాత, అయోధ్య మాదిరిగా, మథుర, కాశీల్లో గతంలో ఆలయాలు ఉన్న ప్రదేశాలలో ఆలయాలను నిర్మించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ప్రదేశాల్లో కొత్తగా నిర్మించిన ఆలయాల్లో హిందువులకు పూజలు చేసుకునే హక్కును ఇవ్వాలని నేను మళ్లీ అభ్యర్థిస్తున్నాను. ఈ స్థలాలను హిందువులకు అప్పగించండి, ఇది సరైన పరిష్కారం’’ అని ఆమె అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ఉన్న మసీదు ఆలయ అవశేషాలపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన చోట తవ్వకాలతో సహా “సమగ్ర శాస్త్రీయ సర్వే” నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు గత సంవత్సరం జూలై 21 న భారత పురావస్తు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

Add Comment