చనిపోయేంత వరకు రాదు నడుము నొప్పి , మోకాళ్ళ నొప్పి , దోమలకు చెక్…

మన ఇంట్లో దోమలు పూర్తిగా నివారణ కావడానికి, ఒక అద్భుతమైన ఆకు గురించి తెలుసుకుందాం, దోమలు పోవడానికి మనం రకరకాల వస్తువులను మార్కెట్లో కొని, ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాం, అలాగే మనం దోమలు పోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం, మనం మార్కెట్లో కొని ఉపయోగించే వస్తువులను, దోమల నివారణకు వాడడం వల్ల మనకు కూడా హాని కలుగుతుందని, మనకు తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే అనేక రకాల దోమలు, మన ఇంట్లో చొరబడి మనకు నిద్రపట్టకుండా చేస్తాయి.అంతేకాకుండా దోమ కాటు వల్ల, మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని, మనం భయపడుతూ ఉంటాం, అందుకే మనం మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఈ మొక్క ను ఉపయోగించి, దోమలు పారిపోయేలా చేయవచ్చు, ఈ మొక్క ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఈ మొక్కను గడ్డిచామంతి లేదా గాయపు ఆకు, అని లేదా పలక ఆకు అని, లేదా రావణాసుర దళ అనే, ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపిస్తాయి.

మన చుట్టుపక్కల కూడా ఈ మొక్కలు అక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటాయి, మైదానాలలో రోడ్లకు ఇరువైపుల ఈ మొక్కలను మనం చూస్తూ ఉంటాం, పల్లెటూర్లలో నివసించేవారికి అయితే ఈ మొక్క గురించి చాలా బాగా తెలుస్తుంది, గడ్డి చామంతి మొక్క, ఆస్టరేసి కుటుంబానికి చెందినది, ఈ గడ్డి చామంతి మొక్క యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది, అందుకే పల్లెటూర్లలో ఈ మొక్కను గాయాలను మాన్పడానికి వాడుతూ ఉంటారు, గాయం అయిన చోట ఈ మొక్క ఆకు రసం పిండితే, గాయం త్వరగా మానుతుంది అని వారి నమ్మకం.అందుకే పల్లెటూర్లలో ఈ మొక్క ని గాయపు ఆకు అని పిలుస్తారు, గడ్డిచామంతి ఆకులకు మన ఇంట్లో ఉండే దోమలను పారదోలే క్రిమిసంహారక లక్షణాలు చాలా ఉన్నాయి, దోమల నివారణకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి, దోమల నివారణ కోసం దీన్ని ఎండిన ఆకులను మనం సేకరించుకోవాలి, లేదా పచ్చి ఆకులను తెచ్చుకొని, మూడు నుంచి నాలుగు రోజులపాటు నిల్వ ఉంచితే అవి ఎండిపోతాయి.

Gaddi Chamanthi: మానని గాయాలు, తీవ్రమైన జుట్టు సమస్యలను పైసా ఖర్చు లేకుండా  తీర్చే గడ్డి చామంతి.. ఆరోగ్య ప్రయోజనాలు | Gaddi chamanthi uses and health  benefits in telugu ...

ఇలా ఎండిపోయాక వీటిని ఒక మట్టి పాత్రలో పెట్టి పైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి, వెలిగిస్తే పొగలాగా వస్తుంది. ఈ పొగ నుండి వచ్చే వాసనను దోమలు అస్సలు తట్టుకోలేవు, ఈ వాసన పీల్చగానే దోమలు అన్ని చనిపోతాయి.దీన్ని ఇంటి మధ్యలో పెట్టి, లైట్ ఆఫ్ చేసి తలుపులు కిటికీలు వేయండి, పది నిమిషాలు అయిన తర్వాత ప్రధాన ద్వారం తెరిచి 5 నిమిషాలు ఉంచండి, ఇలా చేయడం వల్ల దోమల అన్నీ చనిపోతాయి, మిగిలినవి బయటకు వెళ్లిపోతాయి, పూర్వం దోమలను నివారించడానికి, ఈ విధంగా ఈ మొక్క ఆకులను ఉపయోగించేవారు.దోమల్ని పారద్రోలడం లో ఇది చాలా బాగా పనిచేస్తుంది, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి సహజసిద్ధమైన పద్ధతి యిది, వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్కలను చాలామంది, కలుపు మొక్కలు గా భావిస్తూ ఉంటారు. పనికిరాని మొక్కలు అని కూడా అనుకుంటారు, నిజంగా ఈ మొక్క మనకు చేసే మేలు తెలిస్తే, మనం ఆశ్చర్యపోవాల్సిందే…