చలికాలంలో పొడి చర్మం గల వ్యక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. దీంతో ప్రజలు చలికి తట్టుకోలేకపోతూ చాలా మంది ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక చలికాలం చలితో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గల వ్యక్తుల చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇక వీటితో పాటు చలికాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి :

చలికాలంలో పొడి చర్మం గల వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

  • పొడి చర్మం గల వ్యక్తులు రోజుకి రెండు సార్ల మొహం కడిగితే సరిపోతుంది.
  • గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. అదే పనిగా ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. అలా చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది.
  • చర్మాన్ని తెమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్ వాడటం మంచిది. మార్కెట్ లో అందుబాటులో ఉన్నవి కాకుండా మీ చర్మానికి ఏది సెట్ అవుతుందో అది వాడితే సరిపోతుంది.
  • చర్మం పొడిబారిన పడకుండా రోజుకు ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు తినాలి.
  • పెదవులపై పగుళ్లు ఏర్పడితే రాత్రి పడుకునే ముందు తేనె రాసుకుంటే మంచిది. ఉదయం లేచే సరికి పేదాలు తేమగా మారతాయి.
  • ఇక ముఖ్యంగా చలికాలం అనగానే చాలా మందికి అరికాళ్లు పగులుతూ ఉంటాయి. అలా పగిలిన కాళ్లకు మాయిశ్చరైజర్ రాసి సాక్సులు ధరిస్తే ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
  • పొడి చర్మం గల వ్యక్తులు పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.