చా***ను ముందే తెలిపే ఆలయం గురించి ఎప్పు డైనా విన్నారా….

మన దేశంలో ఎన్నో పవిత్రమైన ఆలయాలు కొలువై ఉన్నాయి. దేశం నలుమూలల ప్రాచీన పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో పశుపతినాథ్ ఆలయం చాలా విశిష్టమైనది, ఈ ఆలయంలో పరమేశ్వరుడు పశుపతి రూపంలో కొలువై ఉంటాడు. అందుకే దీనిని పశుపతి ఆలయం అంటారు. జీవితంలో చివరి దశలో ఈ ఆలయాన్ని చేరుకొని, స్వామి వారిని దర్శించుకోవడం వల్ల జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి, మనకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు, అయితే ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మరి ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఒక మనిషి జననమరణ విషయాలను గురించి సామాన్యంగా ఎవరికీ తెలియదు కానీ, పశుపతి ఆలయంలో మాత్రం ప్రధాన అర్చకులు భక్తులు మరణ తేదీ సమయాన్ని కచ్చితంగా చెబుతారు. ఈ సృష్టిలో మరణం గురించి చెప్పేది కేవలం దైవం మాత్రమే కానీ, ఈ ఆలయంలో మనిషి మరణానికి ముందుగానే చెప్పేస్తారు.

అందుకు కారణం ఈ ఆలయ ఆవరణలో మరణ దేవత ఉండడమే కారణం. హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న పశుపతి ఆలయాన్ని చివరి దశలో దర్శించి ఇక్కడ ప్రాణాలు వదిలితే వారి జీవితంలో చేసిన పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లిన భక్తులకు మరణం రావడం అనేది కూడా చాలా అదృష్టంగా చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అనుమతించబడరు. కావాలంటే ఆలయ ప్రాంగణాలలో ఎక్కడైనా తిరగవచ్చు ఇతర మతస్తులు. ఏది ఏమైనా చావును ముందుగానే ఈ ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేస్తారు అనడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ దేవాలయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి దివ్య త్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలి అంటే, కచ్చితంగా పశుపతిని కొలవాలి మోక్షానికి దగ్గర దారి చూపడం పశుపతి నాదుడికి మాత్రమే సాధ్యం, అలాగే ఈ ఆలయంలోని ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ పశుపతి నాథుడు సర్వశక్తిమంతుడు ఆయన ముందు ఎవరైనా సరే నిజం చెప్పి తీరాలి. అపద్దం పొరపాటున కూడా చెప్పకూడదు, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆలయంలోని ధర్మశాల ముందు ప్రమాణం కూడా చేయిస్తారు, ఇక మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఇక్కడ పశుపతి నాధుని దర్శించుకుంటే పుణ్యమని కూడా భావిస్తారు…